‘చేయూత’ సొమ్మును సద్వినియోగం చేసుకోవాలి : విప్‌

ABN , First Publish Date - 2021-06-23T06:19:10+05:30 IST

ప్రభుత్వం అందించే చేయూత పథకం సొమ్ము ను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.

‘చేయూత’ సొమ్మును సద్వినియోగం చేసుకోవాలి : విప్‌
రాయదుర్గంలో చెక్కును పంపిణీ చేస్తున్న ప్రభుత్వ విప్‌ కాపు

రాయదుర్గం రూరల్‌/తాడిపత్రి/గుంతకల్లు టౌన/గుత్తి/గుమ్మఘ ట్ట/కణేకల్లు : జూన 22 : ప్రభుత్వం అందించే చేయూత పథకం సొమ్ము ను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన పట్టణంలోని డ్వామా కార్యాలయంలో మహిళలకు ‘చేయూత’ రెండో విడత చెక్కులను అందజేసి మా ట్లాడారు. నియోజకవర్గ పరిధిలో 10,310 మందికి గాను రూ.32.46 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. మున్సిపల్‌ పరిధిలో 3337 మంది మహిళా సం ఘ సభ్యులకు రూ.6.26 కోట్లు, రాయదుర్గం మండలంలో 2545 మందికి రూ.4.77 కోట్లు, బొమ్మనహాళ్‌ మండలంలో 2,908 మంది లబ్ధిదారులకు రూ.5.45 కోట్లు, డీ హీరేహాళ్‌ మండలంలో 2260 మందికి గాను రూ.4.24 కోట్లు, కణేకల్లు మండలంలో 3316 మందికి రూ.6.22 కోట్ల నిధులు మం జూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన పొరాళ్లు శిల్ప, వైస్‌ చైర్మన శ్రీనివాసయాదవ్‌, వైఎస్సార్‌ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి గౌ ని ఉపేంద్రరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ జబ్బార్‌ మియా, వెలుగు ఏరియా కోఆర్డినేటర్‌ గంగాధర,  మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. తాడిప త్రి నియోజకవర్గంలో వైఎ్‌సఆర్‌ చేయూత కింద రూ.23.56 కోట్ల చెక్కు ను ఎమ్మెల్యే పెద్దారెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈపథకంకింద 12564 మంది లబ్ధిపొందనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ఆయన పెద్దపప్పూరు మండలం జూటూరు, పసలూరు గ్రామ సచివాలయాలను తనిఖీచేశారు. ఈ సందర్భంగా విధులకు హాజరుకాని సిబ్బందికి షోకాజ్‌ నోటీసులు అం దజేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహప్రసాద్‌, అధికారులు పాల్గొన్నారు. గుంతకల్లు పట్టణంలోని సచివాలయాల్లో  వైఎ్‌సఆర్‌ చేయూత కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యమం త్రి జగన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మున్సిపల్‌ చైర్‌పర్సన ఎన భవాని, వైస్‌ చైర్‌పర్సన మైమున, కమిషనర్‌ బండి శేషన్న, మెప్మా టీపీఆ ర్వో ఓ రామాంజినేయులు, టీపీఎంఎం మధుసూదన రెడ్డి, కౌన్సిలర్లు రవి, ఇబ్రహీం, భాస్కర్‌ పాల్గొన్నారు. మండలంలోని పులగుట్టపల్లి పెద్ద తండాలో కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. గుత్తి మున్సిపల్‌ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి చైర్‌పర్సన వన్నూరుబీ ముఖ్యఅతిథి గా హాజరై లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో వైస్‌ చైర్‌పర్సన పద్మలత, కమిషనర్‌ గంగిరెడ్డి, సచివాలయ క్లర్క్‌ ఇమాంహుసేన, మెప్మా అధికారి కెరణ్‌, సీఓ సుమలదుర్గ, జీపీఓ నరేష్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు. గుమ్మఘట్టలో ఎంపీడీవో శివరామ్‌ ప్రసాద్‌ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌ చేయూత పంపిణీపై మహిళలకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా వీడియో కాన్ఫరెన్స ద్వారా సీఎం ప్రసంగాన్ని తిలకించారు. కార్యక్రమంలో ఈవోపీఆర్డీ సురేష్‌ బాబు, ఆయా పంచాయ తీ కార్యదర్శులు పాల్గొన్నారు. కణేకల్లు మండలం కళేకుర్తి గ్రామంలో వైఎస్సార్‌ చేయూత కార్యక్రమాన్ని మార్కెట్‌ యార్డు చైర్‌పర్సన ఉషారాణి ప్రా రంభించారు. జగన చిత్రపటానికి మహిళలతో కలసి క్షీరాభిషేకం చేశారు. గ్రామంలో దాదాపు 96 మందికి పథకం వర్తించిందని, ఒక్కొక్కరి ఖాతాల్లోకి రూ.18,750 సొమ్ము జమ అయినట్లు తెలిపారు. కార్యక్రమంలో స ర్పంచ భాస్కర్‌ రెడ్డి, వెలుగు అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-23T06:19:10+05:30 IST