భారీ అగ్ని ప్రమాదం - రూ.45 లక్షల ఆస్తి నష్టం

ABN , First Publish Date - 2021-03-03T07:12:38+05:30 IST

పట్టణంలోని కాయగూరల మార్కెట్‌ సమీపంలో వున్న గుజిరి దుకాణంలో సోమవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చో టు చేసుకుంది.

భారీ అగ్ని ప్రమాదం - రూ.45 లక్షల ఆస్తి నష్టం
ఎగిసిపడుతున్న మంటలు

రాయదుర్గం టౌన, మార్చి 2 : పట్టణంలోని కాయగూరల మార్కెట్‌ సమీపంలో వున్న గుజిరి దుకాణంలో సోమవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చో టు చేసుకుంది. రూ.45 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లిందని బాధితులు తెలిపా రు. స్థానికులు తెలిపిన వివరాలివి. మార్కెట్‌ సమీపంలోని ఓ భవనంలో ఉడేగో ళం హరిజన హనుమంతు గుజిరి వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో విద్యుత షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా నిప్పురవ్వలు ఎగిసిపడి గుజిరి దుకాణం మీద పడ్డాయి. ప్లాస్టిక్‌ వస్తువులకు నిప్పంటుకోవడంతో పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో చుట్టుపక్కల ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు. మంటలు సమీప గృహాలకు తాకడంతో నిద్రిస్తున్న జనం అరుపు లు, కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. మంటలు తాకిన ఓ ఇంట్లో ని ద్రిస్తున్న యువకుడు బయటకు రావడానికి వీలులేక చిక్కుకుపోయాడు. దీంతో ఇనుప రాడ్‌తో కిటికీలు బద్దలు కొట్టి ఇంటి నుంచి బయటపడ్డాడు. దీంతో చు ట్టుపక్కల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మంటలు పెద్దఎత్తున ఎగిసిపడడంతో సమీపంలో నిలిపివున్న రెండు ద్విచక్ర వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. ఓ ఇండికా కారుతో పాటు మూడు గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. గుజిరి దుకాణమంతా పూర్తిగా కాలిబూడిదైంది. మంటలు చెలరేగే కొద్దీ చుట్టుపక్కల ప్ర జల్లో భయాందోళన అధికమైంది. స్థానికులు అగ్నిమాపక అధికారి, పోలీసులకు ప్రమాద సమాచారాన్ని ఫోన్లో చేరవేశారు. అగ్నిమాపక వాహనం అందుబాటు లో లేకుండా పోయింది. దీంతో రెండు గంటలు ఆలస్యంగా సహాయక చర్యలు చేపట్టాల్సి వచ్చింది.


               కర్ణాటక ప్రాంతమైన మొలకాల్మూరుకు చెందిన అగ్నిమాప క వాహనంతో పాటు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. సీఐ ఈరణ్ణ, ఎస్‌ఐ రాఘవేంద్ర, పోలీసు సిబ్బంది సైతం స హాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. అగ్నిమాపక వాహనాలు రాక ముందు వ రకు దాదాపు రెండు గంటల పాటు మంటలు ఆర్పడానికి స్థానిక యువకులు విశ్వప్రయత్నాలు చేశారు. నీళ్లతో పాటు మట్టిని చల్లి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. సకాలంలో యువత చేరి మంటలు ఆర్పే ప్రయత్నం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి, వైసీపీ నాయకులు ఘటనా స్థలాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. మంటలు పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చేంతవరకు అక్కడే ఉంటూ పర్యవేక్షించారు. 

Updated Date - 2021-03-03T07:12:38+05:30 IST