దమ్మాయిగూడ కౌన్సిలర్లు, ప్రజలకు మధ్య వాగ్వివాదం

ABN , First Publish Date - 2020-12-03T17:58:34+05:30 IST

ప్రభుత్వ స్థలాన్ని స్మశాన వాటికకు కేటాయించాలంటూ దమ్మాయిగూడ మున్సిపల్ సమావేశం మందిరంలో ప్రజలు ఆందోళనకు దిగారు

దమ్మాయిగూడ కౌన్సిలర్లు, ప్రజలకు మధ్య వాగ్వివాదం

మేడ్చల్: ప్రభుత్వ స్థలాన్ని స్మశాన వాటికకు కేటాయించాలంటూ దమ్మాయిగూడ మున్సిపల్ సమావేశం మందిరంలో ప్రజలు ఆందోళనకు దిగారు. జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని  ప్రభుత్వ స్థలం 530 సర్వే నెంబర్‌ను కొందరు కబ్జా చేశారని... ఆ స్థలాన్ని స్మశాన వాటికకు కేటాయించాలని ప్రజలు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై సమావేశ మందిరంలో కౌన్సెలర్‌లు ప్రజలకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.


530 ప్రభుత్వ స్థలాన్ని కొందరు రియల్ వ్యాపారులు కబ్జా చేశారు. కనీసం స్మశానాలను కూడా రియల్ ఎస్టేట్ దళారులు వదలని పరిస్థితి ఏర్పడినప్పటి ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది.  ఈ వ్యవహారంపై కొంత మంది ప్రజా ప్రతినిధులు, అధికారులపై దమ్మాయిగూడ ప్రజానీకం దుమ్మెత్తి పోస్తోంది. కొంత మంది ప్రజాప్రతినిధులు రియల్ వ్యాపారులు ప్లాట్స్‌గా చేసి అమ్మడానికి ప్రయతింస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ప్రభ్యత్వ  స్థలం అయిన 530 సర్వే నెంబర్‌ను స్మశాననికి కేటాయించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న స్మశానం 200 గజాలలో మాత్రమే ఉందని, కనీస సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు రియల్ వ్యాపారులు కుమ్మక్కై స్మశానాన్ని కబ్జా బాగోతం ఆడుతున్నారని ఆగ్రహంతో ప్రజలు మునిసిపల్ ఆఫీస్‌ను ముట్టడించారు. 

Updated Date - 2020-12-03T17:58:34+05:30 IST