మేడ్చల్‌ జిల్లా నెంబర్‌వన్‌

ABN , First Publish Date - 2022-06-29T05:27:01+05:30 IST

ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో మేడ్చల్‌ జిల్లా విద్యార్థులు సత్తా చాటారు.

మేడ్చల్‌ జిల్లా నెంబర్‌వన్‌

  • ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాల్లో మేడ్చల్‌ జిల్లాకు రాష్ట్రంలో మొదటి స్థానం
  • వరుసగా రెండో ఏడాది అగ్రస్థానంలో నిలిచిన వైనం
  • మూడో స్థానంలో దక్కించుకున్న రంగారెడ్డి జిల్లా
  • ఉత్తీర్ణతలో అమ్మాయిలదే హవా..
  • మాడ్గుల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 94.67 ఉత్తీర్ణత 


ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో మేడ్చల్‌ జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరం ఫలితాల్లో అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని సాధించి జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపారు. దీంతో ఇంటర్‌ ఫలితాల్లో మేడ్చల్‌ జిల్లా వరుసగా రెండోసారి నెంబర్‌వన్‌గా నిలిచింది. రంగారెడ్డి జిల్లా రాష్ట్రంలో మూడోస్థానాన్ని సరిపెట్టుకుంది. ఫలితాల్లో బాలుర కంటే బాలికలే పైచేయి సాధించారు. 


రంగారెడ్డి అర్బన్‌ / వికారాబాద్‌ / మేడ్చల్‌, జూన్‌ 28 ( ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : తెలంగాణ ఇంటర్‌ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఇంటర్‌ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ పరీక్షా ఫలితాల్లో మేడ్చల్‌ జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. మూడో స్థానాన్ని రంగారెడ్డి జిల్లా దక్కించుకుంది. జనరల్‌ ఫస్టియర్‌లో మేడ్చల్‌ జిల్లా 76శాతం ఉత్తీర్ణత సాధించగా సెకండియర్‌లో 78 శాతం ఉత్తీర్ణత సాధించింది. ఫస్టియర్‌ కంటే.. సెకండియర్‌లోనే విద్యార్థులు సత్తా చాటారు. అలాగే రంగారెడ్డి జిల్లాలో ఫస్టియర్‌లో 72శాతం ఉత్తీర్ణత సాధించగా సెకండియర్‌లో 75శాతం సాధించారు. వికారాబాద్‌ జిల్లాలో ఫస్టియర్‌లో 54శాతం ఉత్తీర్ణత సాధించగా సెకండియర్‌లో 57శాతం ఉత్తీర్ణత సాధించారు. మేడ్చల్‌ జిల్లాతో పాటు రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలో కూడా ఫస్టియర్‌ కంటే.. సెకండియర్‌లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారు. 


అమ్మాయిలదే హవా..

ఇంటర్‌ ఫలితాల్లో ఈసారి కూడా అబ్బాయిల కంటే..  అమ్మాయిలే పైచేయి సాధించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోరెండు సంవత్సరాల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. మేడ్చల్‌ జిల్లాలో ఇంటర్‌ ఫస్టియర్‌లో 81 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించారు. అలాగే సెకండియర్‌లో 84శాతం ఉత్తీర్ణత సాధించారు. రంగారెడ్డి జిల్లాలో ఫస్టియర్‌లో 78 మంది బాలికలు ఉత్తీర్ణత సాధించగా సెకండియర్‌లో 81శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించారు. అలాగే వికారాబాద్‌ జిల్లాలో ఫస్టియర్‌లో 64శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించగా సెకండియర్‌లో 68శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించారు. అలాగే ఒకేషనల్‌ ఫస్టియర్‌ ఫలితాల్లో అమ్మాయిలే ముందంజలో ఉన్నారు. మేడ్చల్‌ జిల్లాలో ఫస్టియర్‌ ఒకేషనల్‌లో 70శాతం, సెకండియర్‌ ఒకేషనల్‌లో 77శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్‌ కంటే.. సెకండియర్‌లోనే బాలికలు అత్యున్నత ప్రతిభను చాటారు. రంగారెడ్డి జిల్లాలో ఫస్టియర్‌ ఒకేషనల్‌ ఫలితాల్లో 67 శాతం, సెకండియర్‌లో 73శాతం బాలికలు పాసయ్యారు. వికారాబాద్‌ జిల్లాలో ఫస్టియర్‌ ఒకేషనల్‌ ఫలితాల్లో 68శాతం, సెకండియర్‌ ఒకేషనల్‌ ఫలితాల్లో 75 శాతం బాలికలు ఉత్తీర్ణులయ్యారు. 


94.67 శాతం సాధించిన మాడ్గుల ప్రభుత్వ కళాశాల

ప్రైవేట్‌ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లో విద్యాబోధన సాగుతుందనడానికి రంగారెడ్డి జిల్లా మాడ్గుల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను నిదర్శనంగా చెప్పవచ్చు. ఇంటర్‌ పరీక్ష ఫలితాల్లో 94.67 శాతం ఉత్తీర్ణత సాధించి తోటి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు ఆదర్శంగా నిలిచింది.


ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు

ఆగస్టు 1వ తేది నుంచి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈనెల 30వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించారు. ఆగస్టు చివరి నాటికి సస్లిమెంటరీ ఫలితాలు విడుదల చేయనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. 


ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో దోమ అగ్రస్థానం

ఇంటర్‌ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు మెరుగైన ఫలితాలు సాధించడంలో కొంత తడబాటు పడ్డాయి. మూడేళ్ల నాటి ఫలితాలతో పోలిస్తే ఉత్తీర్ణతా శాతం తగ్గింది. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు సంబంధించి ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 1,652 మంది విద్యార్థులు హాజరు కాగా, వారిలో 850 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 876 మంది బాలురకు 345 మంది ఉత్తీర్ణత సాధించగా, 776 మంది బాలికలకు 505 మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ కళాశాలల్లో దోమ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల 69.57 శాతం ఉత్తీర్ణత సాధించి వికారాబాద్‌ జిల్లాలో అగ్రగామిగా నిలిచింది. ఈ కళాశాలలో 184 మంది విద్యార్థులకు 128 మంది ఉత్తీర్ణత సాధించారు. కొడంగల్‌ జూనియర్‌ కళాశాలల 65.53 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈ కళాశాలలో 206 మంది విద్యార్థులకు 135 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగలిగారు. మర్పల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల 63.64 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఇక్కడ 66 మంది విద్యార్థులకు 42 మంది ఉత్తీర్ణత సాధించారు. వికారాబాద్‌ జూనియర్‌ కళాశాల 61.5 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈ కళాశాలలో 200 మంది విద్యార్థులకు 123 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పరిగి జూనియర్‌ కళాశాల 55.08 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈ కళాశాలలో 187 మంది విద్యార్థులకు 103 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. తాండూరు జూనియర్‌ కళాశాల 42.03 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈ కళాశాలలో 521 మంది విద్యార్థులకు 219 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. నవాబుపేట జూనియర్‌ కళాశాల 36.99 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈ కళాశాలలో 73 మంది విద్యార్థులకు 27 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.పెద్దేముల్‌ జూనియర్‌ కళాశాల 34.4 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఇక్కడ 125 మంది విద్యార్థులకు 43 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగలిగారు. మోమిన్‌పేట జూనియర్‌ కళాశాల 32.61 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఇక్కడ 92 మంది విద్యార్థులకు 30 మంది ఉత్తీర్ణత సాధించగలిగారు. 


ఉమ్మడి జిల్లాలో ఇంటర్‌ ఫలితాల వివరాలు

జనరల్‌ ఫస్ట్‌ ఇయర్‌

బాలురు బాలికలు మొత్తం

జిల్లా హాజరు పాస్‌ శాతం హాజరు పాస్‌ శాతం హాజరు పాస్‌ శాతం

మేడ్చల్‌ 28,830 21,014 72 24,037 19,689 81 52,867 40,703 76

రంగారెడ్డి 29,634 19,956 67 26,725 21,100 78 56,359 41,056 72

వికారాబాద్‌ 3,978 1,654 41 4,022 2,589 64 8,000 4,243 53

ఒకేషనల్‌ ఫస్ట్‌ ఇయర్‌

బాలురు బాలికలు మొత్తం

జిల్లా హాజరు పాస్‌ శాతం హాజరు పాస్‌ శాతం హాజరు పాస్‌ శాతం

మేడ్చల్‌ 570 239 41 481 341 70 1,051 580 55

రంగారెడ్డి 1,804 569 31 1,523 1,021 67 3,327 1,590 47

వికారాబాద్‌ 508 165 32 842 576 68 1,350 741 54

జనరల్‌ సెకండియర్‌ (రెగ్యులర్‌) 

బాలురు బాలికలు మొత్తం

జిల్లా హాజరు పాస్‌ శాతం హాజరు పాస్‌ శాతం హాజరు పాస్‌ శాతం

మేడ్చల్‌ 26,007 19213 73 22,814 19,237 84 48,821 38,450 78

రంగారెడ్డి 28,000 19,703 70 24,265 19,707 81 52,265 39,410 75

వికారాబాద్‌ 3,501 1639 46 3,665 2511 68 7,166 4,550 57

ఒకేషనల్‌ సెకండియర్‌ (రెగ్యులర్‌) 

బాలురు బాలికలు మొత్తం

జిల్లా హాజరు పాస్‌ శాతం హాజరు పాస్‌ శాతం హాజరు పాస్‌ శాతం

మేడ్చల్‌ 536 302 56 403 313 77 939 615 65

రంగారెడ్డి 1,622 793 48 1,127 828 73 2,749 1621 58

వికారాబాద్‌ 336 153 45 579 440 75 915 593 64

జనరల్‌ సెకండియర్‌ (ప్రైవేట్‌) 

బాలురు బాలికలు మొత్తం

జిల్లా హాజరు పాస్‌ శాతం హాజరు పాస్‌ శాతం హాజరు పాస్‌ శాతం

రంగారెడ్డి 261 52 19 229 78 34 490 130 26

మేడ్చల్‌ 303 50 16 228 59 25 531 109 20

వికారాబాద్‌ 62 05 08 62 16 25 124 21 16

సెకండియర్‌ ఒకేషనల్‌( ప్రైవేట్‌)

బాలురు బాలికలు మొత్తం

జిల్లా హాజరు పాస్‌ శాతం హాజరు పాస్‌ శాతం హాజరు పాస్‌ శాతం

మేడ్చల్‌ 02 02 100 0 0 0 02 02 100

వికారాబాద్‌ 04 03 75 03 02 66 07 05 71

రంగారెడ్డి 15 05 33 12 07 58 27 12 44


Updated Date - 2022-06-29T05:27:01+05:30 IST