తనదైన శైలిలో బ్యాటింగ్ చేసి.. సునాయాసంగా పరుగులు తీస్తూ వరుసగా రెండు ఫోర్లను కొట్టారు. 12 బంతుల్లో 18 పరుగులు చేసి మంత్రి హరీష్ రావు ఔటయ్యారు. అభిమానులను, ప్రేక్షకులను అలరించేలా హరీష్ రావు బ్యాటింగ్ సాగింది. రాజకీయాల్లో మాత్రమే కాకుండా క్రికెట్‌లో కూడా తనదైన వ్యూహాలతో టీంకు కెప్టెన్‌గా వ్యవహరించారు. బ్యాటింగ్‌లో దూకుడు ప్రదర్శించి హిట్టర్ అనిపించుకున్నారు. హరీష్ రావు బ్యాటింగ్ చేస్తున్నంత సేపు అభిమానులు, ప్రేక్షకులను కేరింతలు కొడుతూ, ఈలలేస్తూ సందడి చేశారు.