Advertisement

మిషన్‌ భగీరథ తాగునీటిని వినియోగించుకోవాలి

Mar 6 2021 @ 00:12AM
వర్గల్‌ మండల సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ జాలిగామ లత

వర్గల్‌ మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ లత

వర్గల్‌, మార్చి 5 : రాష్ట్ర ప్రభుత్వం ప్రజల క్షేమం కోసం అన్ని గ్రామాల్లో ప్రవేశపెట్టిన మిషన్‌ భగీరథ పథకం తాగునీటిని ప్రజలు వినియోగించుకోవాలని వర్గల్‌ ఎంపీపీ జాలిగామ లత అన్నారు. శుక్రవారం వర్గల్‌ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ జాలిగామ లత అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. మండలంలోని వేలూర్‌, నాచారం పరిసర ప్రాంతాల్లో రైతులకు కావలసిన ఎరువులను ఫర్టిలైజర్‌ దుకాణాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నరని వాపోయారు. పీఏసీఎస్‌, ఆగ్రోస్‌ వర్గల్‌ మండల కేంద్రంలో ఉండటంతో అంత దూరం నుంచి వచ్చి ఎరువులను కోనేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నాచారం, వేలూర్‌ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వం ద్వారా ఎరువుల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నాచారం ఎంపీటీసీ వెంకటేశ్‌ అగ్రికల్చర్‌ అధికారులకు సూచించారు. అలగే మండల వ్యాప్తంగా కొవిడ్‌ నియంత్రణ కోసం వ్యాక్సిన్‌ టీకాలు ఇవ్వడం జరుగుతుందని మండల వైద్యాధికారి హరిత తెలిపారు. వ్యాక్సిన్‌ వేయించుకునే వారు యాప్‌లో రిజిస్ర్టేన్‌ చేయించుకున్నట్లయితే టీకాను అందిస్తామన్నారు.  అనంతరం ఎంపీపీ లత మాట్లాడుతూ మిషన్‌ భగిరథ తాగునీరుపై ప్రజలకు అవగాహన కల్పించవలసిన అవసరముందన్నారు. మిషన్‌ భగిరథ తాగునీరు స్వచ్ఛమైనదని, గ్రామాల్లో విక్రయించే ఫిల్టర్‌ చేసిన నీటిని తాగి ఆరోగ్యాన్ని పాడుచేసుకోవద్దని ప్రజలకు సూచించారు. సమావేశంలో ఎంపీడీవో మేరి స్వర్ణకుమారి, జడ్పీటీసీ బాలు యాదవ్‌, తహసీల్దార్‌ వాణీరెడ్డి, ఎంపీటీసీలు జయమ్మ, శ్యామల, వెంకటేశ్‌, శ్రీనివాస్‌, సంది్‌పరెడ్డి, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

నాచారం ధర్మకర్తల మండలి చైర్మన్‌, సభ్యులకు సన్మానం

వర్గల్‌ మండల సర్వసభ్య సమావేశానికి వచ్చిన నాచగిరి లక్ష్మీనృసింహస్వామి క్షేత్రం ధర్మకర్తల మండల చైర్మన్‌గా నియామకమైన హన్మంతరావుతో పాటు పలువురు ధర్మకర్తల మండలి సభ్యులను ఎంపీపీ లత, జడ్పీటీసీ బాలు యాదవ్‌, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు శాలువతో ఘనంగా సన్మానించారు. 

Follow Us on:
Advertisement