Advertisement

రైతుల సంక్షేమమే డీసీఎంఎస్‌ లక్ష్యం

Oct 30 2020 @ 06:19AM

ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి


నారాయణఖేడ్‌, అక్టోబరు 29 : రైతుల సంక్షేమమే డీసీఎంఎస్‌ లక్ష్యమని ఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, డీసీఎంఎస్‌ జిల్లా చైర్మన్‌ శివకుమార్‌ అన్నారు. ఖేడ్‌ మండలం నిజాంపేటలో సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని తూకం వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో ఫర్టిలైజర్‌ దుకాణాలలో తక్కువ ధరకే ఎరువులను అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్‌ వెంకట్‌రాంరెడ్డి, డీసీసీబీ జిల్లా డైరెక్టర్‌ వెంకట్‌రాములు, మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు సాయిరెడ్డి, సర్పంచ్‌ జగదీశ్వరాచారి, ఉపసర్పంచ్‌ రాజీబాయిరాంచందర్‌ పాల్గొన్నారు. 


ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే

కల్హేర్‌, అక్టోబరు 29 : రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి అన్నారు. మండలంలోని ఖానాపూర్‌(కే) మునిగేపల్లి, బాచేపల్లి, రాంచందర్‌తండా, మార్డి, పోమ్యానాయక్‌తండా, మాసన్‌పల్లి, మహదేవ్‌పల్లి, ఖానాపూర్‌(బీ), రాంరెడ్డిపేట్‌, దామరచెరు, నాగ్‌ధర్‌, కల్హేర్‌ గ్రామాలతో పాటు సిర్గాపూర్‌ మండలంలోని బొక్క్‌సగామ్‌లో ఎమ్మెల్యే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో డీసీసీబీ డైరెక్టర్‌ గుండు వెంకట్‌రాములు, ఎంపీపీ సుశీల, బాచేపల్లి పీఏసీఎస్‌ చైర్మన్‌ సంగారెడ్డి పాల్గొన్నారు. 


దళారీ వ్యవస్థ నిర్మూలనకే కొనుగోలు కేంద్రాలు

హత్నూర, అక్టోబరు 29 : దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఎంపీపీ అధ్యక్షుడు నర్సింహులు అన్నారు. గురువారం మండలంలోని హత్నూర, చీక్‌మద్దూర్‌, గోవింద్రాజ్‌పల్లి, సిరిపుర, నాగులదేవులపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేద్రాలను ప్రారంభించారు. పీఏసీఎస్‌ చైర్మన్‌ దుర్గారెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్‌ బుచ్చిరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీనివా్‌సరెడ్డి, డీపీఎం మల్లేశం, ఏపీఎం శ్రీదేవి, సర్పంచులు వీరస్వామిగౌడ్‌, సునీత రాజు, లక్ష్మీమాణయ్య, విజయలక్ష్మీనరేందర్‌, సుధాకర్‌, మహేష్‌, డైరెక్టర్‌ రాములు పాల్గొన్నారు. 

Follow Us on:
Advertisement