శక్తిసామర్థ్యాలకు ప్రతిరూపం మహిళ

ABN , First Publish Date - 2021-03-09T05:43:35+05:30 IST

శక్తిసామర్థ్యాలకు ప్రతిరూపం మహిళ

శక్తిసామర్థ్యాలకు ప్రతిరూపం మహిళ
కవితకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న ప్రజాప్రతినిధులు

  • అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఎమ్మెల్సీ కవిత

మేడ్చల్‌: ప్రశ్నిస్తూ.. పోరాడుతూ.. సవాళ్లు ఎదురైనప్పుడు దైర్యంగా  ఎదుర్కొవాలని.. శక్తిసామర్ధ్యాలకు ప్రతిరూపం మహిళ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఉమెన్స్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆమె హాజరై మాట్లాడారు. ఎంతో మంది మహిళల పోరాటంతోనే నేడు మనం మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని, అన్ని రంగాల్లో నేడు మహిళలది కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో మహిళా సంక్షేమానికి కేసీఆర్‌ పెద్దపీట వేశారని, దీని కోసం కల్యాణలక్ష్మి వంటి పథకాలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. నిర్ణయాత్మక విషయాల్లో మహిళలు పట్టు సాధించాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవితతో విద్యార్థినులు సెల్ఫీ దిగుతూ సందడి చేశారు. కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్ధి వాణి, రాజశేఖర్‌రెడ్డి, కల్పనారెడ్డి, డాక్టర్‌ ప్రీతి, మమత, షాలినీరెడ్డి, మహేందర్‌రెడ్డి, భద్రారెడ్డి, చైర్‌పర్సన్‌లు, ఎంపీపీ పద్మ్డా, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-09T05:43:35+05:30 IST