మోదీవి బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు: నారాయణ

ABN , First Publish Date - 2022-07-19T02:27:16+05:30 IST

రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించుకోవడానికి ప్రధాని నరేంద్రమోదీ బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలను నెరపడం సిగ్గుచేటని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు.

మోదీవి బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు: నారాయణ

తిరుపతి: రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించుకోవడానికి ప్రధాని నరేంద్రమోదీ బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలను నెరపడం సిగ్గుచేటని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. తిరుపతిలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రపతి అభ్యర్థిని ద్రౌపది ముర్మును గెలిపించుకోవడానికి తగినంత బలం బీజేపీకి లేదన్నారు. దీంతో ప్రాంతీయ పార్టీలను ఈడీ దాడులతో బెదిరించి మద్దతుగా మలుచుకోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఈడీ దాడులకు భయపడి రాష్ట్రంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నాయకులు కూడా తలొగ్గారని ఆయన విమర్శించారు. అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఇలా వ్యవహరించడం ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి మచ్చగా మారిందన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం రాజకీయ పార్టీలను ముక్కలు ముక్కలుగా చీల్చి తమ పార్టీకి అనుకూలంగా మలుచుకుంటోందని మండి పడ్డారు. ఇప్పటికే తొమ్మిది రాష్ర్టాల్లో రాజకీయ పార్టీలను చీల్చి బీజేపీ అధికారంలోకి రావడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు.దేశంలో ప్రజాస్వామ్యాన్ని భ్రష్టుపట్టిస్తోందని నారాయణ మండిపడ్డారు.

Updated Date - 2022-07-19T02:27:16+05:30 IST