మరణాలు ఎక్కువ, దరఖాస్తులు తక్కువ

ABN , First Publish Date - 2021-11-11T07:19:43+05:30 IST

కరోనా కారణంగా జిల్లాలో చాలా పెద్ద సంఖ్యలోనే మరణాలు సంభవించాయి.

మరణాలు ఎక్కువ, దరఖాస్తులు తక్కువ

ఆర్థిక సాయంపై నిరాసక్తంగా కరోనా మృతుల కుటుంబాలు


చిత్తూరు, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): కరోనా కారణంగా జిల్లాలో చాలా పెద్ద సంఖ్యలోనే మరణాలు సంభవించాయి. ప్రభుత్వ లెక్కల ప్రకా రమే 1,949 మంది మరణించినట్లు నమోదైంది. అయితే ప్రభుత్వం ప్రకటించిన రూ.50వేల సాయం కోసం దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య 300 మాత్రమే. దరఖాస్తు చేసుకోవడంలో ఉన్న సమస్యల వల్ల, అవగాహన లోపం వల్ల చాలామంది నిశ్శబ్దంగా ఉండిపోతున్నారు. దరఖాస్తుల పరిశీలనకు డెవలప్‌మెంట్‌ జేసీ శ్రీధర్‌ నేతృత్వంలో కరోనా మృతుల నిర్ధారణ కమిటీతో పాటు జిల్లా రెవెన్యూ అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక సెల్‌ కూడా ఏర్పాటు చేశారు. వాస్తవానికి తొలి దశ కంటే రెండో విడతలోనే జిల్లాలో కరోనా మరణాలు అధికంగా నమోదయ్యాయి. చాలామంది వైద్యం అందేలోపే ప్రాణాలు కోల్పోయారు.వీరిలో కొంతమంది కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరి నిర్ధారణ పరీక్షలు జరగకముందే చనిపోయిన వారున్నారు. మరి కొందరు ప్రైవేటుగా పరీక్షలు చేయించుకుని, పడకలు దొరక్క ఇళ్లలోనే ఉంటూ ప్రాణాలు పోయినవారు ఉన్నారు. ఇలాంటి వారి మరణాన్ని ధ్రువీకరించడమే ఇప్పుడు సమస్యగా మారనుంది.అత్యధిక కరోనా మరణాలు తిరుపతి ప్రాంతంలో సంభవించాయి. అయినా తిరుపతి రూరల్‌ మండలం నుంచి 10 దరఖాస్తులు మాత్రమే అందాయి. తవణంపల్లె ఆస్పత్రి లెక్కల ప్రకారం 49 మంది కరోనాతో మరణించగా 40 మంది దరఖాస్తు చేసుకున్నారు.ఆర్సీపురం మండలం నుంచి 13మంది, చిన్నగొట్టిగల్లు నుంచి 27 మంది, నిండ్రనుంచి తొమ్మిదిమంది, ఎర్రావారిపాలెం నుంచి 10మంది, వడమాలపేట నుంచి 20మంది, పీటీఎం మండలం నుంచి 22 మంది దర ఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి 8వ తేదీతో గడువు ముగిసినా మళ్లీ పెంచారు. ఆయా తహసీల్దార్‌ కార్యాలయాల్లో పూర్తిచేసిన దరఖాస్తులు వెంటనే అందజేయాలని డీఆర్వో మురళి కోరారు. 


జత చేయాల్సినవి

చనిపోయిన వ్యక్తి ఆధార్‌ కార్డుఫ కొవిడ్‌ పాజిటివ్‌ సర్టిఫికెట్‌, లేదా కొవిడ్‌తో మరణించినట్లు ధ్రువీకరణ పత్రంఫఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ఫదరఖాస్తుదారుడి బ్యాంకు ఖాతా వివరాలుఫదరఖాస్తుదారుడి ఆధార్‌ కార్డు, ఫోన్‌ నెంబరుఫఆశా, ఏఎన్‌ఎం, మెడికల్‌ ఆఫీసర్ల పేరు, ఆధార్‌, ఫోన్‌ నెంబర్లతో కూడిన సంతకాలు

Updated Date - 2021-11-11T07:19:43+05:30 IST