పురివిప్పిన పాత కక్షలు

ABN , First Publish Date - 2021-05-15T05:49:58+05:30 IST

అమలాపురం, మే 14 (ఆంధ్రజ్యోతి): ఎదురెదురు ఇళ్లల్లో నివసిస్తున్న రెండు కుటుంబాల మధ్య ఉన్న పాత కక్షల నేపథ్యంలో ప్రత్యర్థులు మారణాయుధాలతో దారికాచి తల్లీకొడుకులపై దాడికి తెగబడ్డారు. తల్లి సంఘటనా స్థలంలోనే మృతి చెందగా కుమారుడు తీవ్ర గాయాలతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పట్టణంలోని ఎన్టీఆర్‌ మార్గ్‌లో గల డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో శుక్రవారం సాయంత్రం

పురివిప్పిన పాత కక్షలు
హత్యకు గురైన దుర్గ

తల్లి, కొడుకులపై మారణాయుధాలతో దాడి 

తల్లి మృతి, కొడుకు పరిస్థితి విషమం

అమలాపురం డీఎస్పీ కార్యాలయానికి 

కూతవేటు దూరంలోనే ఘటన

అమలాపురం, మే 14 (ఆంధ్రజ్యోతి): ఎదురెదురు ఇళ్లల్లో నివసిస్తున్న రెండు కుటుంబాల మధ్య ఉన్న పాత కక్షల నేపథ్యంలో ప్రత్యర్థులు మారణాయుధాలతో దారికాచి తల్లీకొడుకులపై దాడికి తెగబడ్డారు. తల్లి సంఘటనా స్థలంలోనే మృతి చెందగా కుమారుడు తీవ్ర గాయాలతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పట్టణంలోని ఎన్టీఆర్‌ మార్గ్‌లో గల డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి... అమలాపురం రూరల్‌ మండలం సమనస గ్రామానికి చెందిన కొండ్రు కోటేశ్వరరావు, మంగం చిరంజీవి ఇళ్లు ఎదురెదురుగా ఉంటాయి. చిన్నచిన్న సమస్యలతో తరచూ గొడవ పడుతుంటారు. ఈ నేపథ్యంలో కోటేశ్వరరావుపై చిరంజీవి కుటుంబ సభ్యులు సమనసలోనే దాడికి యత్నించినట్టు సమాచారం.


అయితే అతడు తప్పించుకుని పరారయ్యాడు. కోటేశ్వరరావు భార్య దుర్గ (45) డీఎస్పీ కార్యాలయ సమీపంలోని ఒక వీధిలో ఇంట్లో పనులు ముగించుకుని కుమారుడు రమేష్‌తో కలిసి మోటారు సైకిలుపై స్వగ్రామం వెళ్తుండగా ఎన్టీఆర్‌ మార్గ్‌ రోడ్డులో చిన్న వంతెన సమీపంలో ప్రత్యర్థులైన మంగం చిరంజీవి, నవీన్‌, కొడుకు విజయ్‌, చిరంజీవి భార్య బేబీ మినీ వ్యాన్‌లో అక్కడ మరణాయుధాలతో దాచికాచారు. కొండ్రు దుర్గ, రమేష్‌ వెళ్తున్న మోటారు సైకిలును అడ్డగించి కత్తులు, గొడ్డళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో దుర్గ అక్కడికక్కడే మృతి చెందగా కుమారుడు రమేష్‌ అపస్మారక స్థితిలో కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పట్టపగలు అందునా కర్ఫ్యూ అమలులో ఉన్న సమయంలో పోలీసు కార్యాలయాల సముదాయాలకు చేరువలో ఈ హత్య జరగడం పట్టణంలో అందరినీ కలవరపాటుకు గురిచేసింది. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ వై.మాధవరెడ్డి, ఇన్‌చార్జి సీఐ జి.సురేష్‌బాబు, పలువురు ఎస్‌ఐలు సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-05-15T05:49:58+05:30 IST