ముస్లింల ద్రోహి సీఎం జగన: టీడీపీ

ABN , First Publish Date - 2022-06-25T05:49:27+05:30 IST

పేద ముస్లిం కుటుంబాలకు బాసటగా ఉండే దుల్హన పథకాన్ని రద్దు చేసి ముస్లింలను సీఎం జగన ద్రోహం చేశాడని టీడీపీ మైనార్టీసెల్‌ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముస్లింల ద్రోహి సీఎం జగన: టీడీపీ
రాయదుర్గంలో మాట్లాడుతున్న టీడీపీ మైనార్టీ సెల్‌ నాయకులు

రాయదుర్గంటౌన, జూన 24: పేద ముస్లిం కుటుంబాలకు బాసటగా ఉండే దుల్హన పథకాన్ని రద్దు చేసి ముస్లింలను సీఎం జగన ద్రోహం చేశాడని టీడీపీ మైనార్టీసెల్‌ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని రాష్ట్ర మైనార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కడ్డిపూడి మహబూబ్‌ బాషా మండిపడ్డారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం నాయకులు విలేకరులతో మాట్లాడారు. నిధులు లేక దుల్హన పథకం నిలిపివేశామని హైకోర్టుకు జగన ప్రభుత్వం చెప్పడాన్ని తీవ్రంగా ఖండించారు. తమ మేనిఫెస్టో బైబిల్‌, ఖురాన, భగవద్గీతతో సమానమని చెప్పుకున్న జగన్మోహన రెడ్డి దుల్హన పథకం అమలుకు డబ్బులు లేవని చేతులెత్తేయడం దుర్మార్గమన్నారు. మైనార్టీ విద్యార్థులకు విదేశీ విద్యను అందించడంలో ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ఘోరంగా విఫలమయ్యాడన్నారు. పెళ్లిఖర్చులు కుటుంబంపై పడరాదని చంద్రబాబు అమలు చేసిన దుల్హన పథకాన్ని, రెట్టింపు సాయం  చేస్తానని విపక్షనేతగా ఉన్నప్పుడు ముస్లింలకు వరాలిచ్చి అదికాస్త తీర్చాల్సి వచ్చేసరికి డబ్బులు లేవని చేతులెత్తేసిన అసమర్థుడు జగన రెడ్డి అని విమర్శించారు. మూడేళ్ల జగన పాలనలో మైనార్టీలకు ఏమి చేశారని ప్రశ్నించారు. వైసీపీకు చెందిన ఆరు మంది మైనార్టీ కౌన్సిలర్లు ఏం మొహం పెట్టుకుని మైనార్టీ వార్డుల్లో గడపగడపకు వెళ్తారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్‌ జిల్లా ఉపాధ్యక్షులు జమీల్‌ ఖాన, మైనార్టీ నాయకులు మారెంపల్లి ఉస్మాన, బడిగే ఇనాయత, అస్లాం బాషా, జీలాన బాషా, నిసార్‌ అహ్మద్‌, గఫూర్‌, దాదాఖలందర్‌, రియాజ్‌ తదితరులు పాల్గొన్నారు. 

గుంతకల్లు: రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీలను మోసం చేసిందని టీడీపీ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు సాలార్‌ బాషా పేర్కొన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా గుంతకల్లుకు వచ్చిన ఆయన జితేంద్రగౌడు క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. మైనార్టీలకు వైసీపీ చేస్తున్న ద్రోహం పట్ల ఉర్దూ అకాడమీ చైర్మన నదీం అహ్మద్‌ నోరు మెదపడం లేదన్నారు. ఈ సమావేశంలో టీడీపీ మైనార్టీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పామిడి మహమ్మద్‌ రఫిక్‌,  కౌన్సిలరు షరీఫ్‌, స్థానిక నాయకులు ఇబ్రహీం సాబ్‌, నాయకులు ఆటో ఖాజా, ఇస్మాయిల్‌, ఆలం నవాజ్‌, రంజాన, అబ్దుల్లా, ఫ్రూట్‌ మస్తాన, ఫజులు, ఆమ్లెట్‌ మస్తాన యాదవ్‌, తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-06-25T05:49:27+05:30 IST