చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

ABN , First Publish Date - 2021-10-17T05:17:46+05:30 IST

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
బేగంపేటలో మాట్లాడుతున్న సీఐ లిక్కి కృష్ణంరాజు

కందుకూరు: చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని 27వ అదనపు మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ మరియు జూనియర్‌ సివిల్‌ జడ్జి(మహేశ్వరం) ఫర్హీన్‌కౌసర్‌, సీఐ లిక్కి కృష్ణంరాజు పేర్కొన్నారు. శనివారం రాచులూరు, లేమూరు, బేగంపేట, తిమ్మాపురం గ్రామాల్లో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుల్లో మాట్లాడారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ను పురస్కరించుకుని నేర రహిత సమాజ నిర్మాణమే ధ్యేయంగా ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆయా గ్రామాల్లో మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు జె.పరంజ్యోతి, శ్రీనివాసచారి, గోవర్ధన్‌, గంగాపురం గోపాల్‌రెడ్డి, మాజీ ఎంపీపీ శోభాఈశ్వర్‌గౌడ్‌, రాచులూరు మాజీ సర్పంచ్‌ కె.సదానంద్‌గౌడ్‌, తిమ్మాపురం ఉపసర్పంచ్‌ శ్రీరాములు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-17T05:17:46+05:30 IST