అశ్వవాహనంపై నారసింహుడు

Published: Sun, 22 May 2022 01:16:46 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అశ్వవాహనంపై నారసింహుడు

ఉరవకొండ, మే 21: మండల పరిధిలోని పెన్నహోబిలం లక్ష్మీన రసిం హస్వామి ఆలయ బ్రహ్మోత్స వాలలో భాగంగా శనివారం స్వామి వారు అశ్వవాహనంపై  భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి సుప్రభా తసేవ, అర్చన, ఉత్సవ నిత్యహో మం, మంగళ హారతులు చేపట్టారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వామి వారిని మేళ తాళాల మధ్య ఊరే గింపుగా తీసుకువచ్చి అశ్వవాహనం పై కొలువుదీర్చారు. ఆలయం చుట్టూ ఉత్సవమూర్తులను ఊరేగించారు. ఈ ఉత్స వాన్ని తిలకిం చేందుకు  భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి శ్రీ అం గదాల నారాయణస్వామి కుటుంబ సభ్యులు ఉత్సవ ఉభయదారులుగా వ్యవ హరించారు. ఈ కార్యక్రమానికి  ఈ కార్యక్రమంలో ఈవో విజయ్‌ కుమార్‌, ఆలయ కమిటీ చైర్మన్‌ అశోక్‌, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.