ఆర్థిక ఇబ్బందులున్నా ఆగని సంక్షేమం

ABN , First Publish Date - 2020-12-03T05:57:45+05:30 IST

రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నిధులు కేటాయిస్తున్నామని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

ఆర్థిక ఇబ్బందులున్నా ఆగని సంక్షేమం
ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణ స్థలాన్ని పరిశీలిస్తున్న మంత్రి

 ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు

 మెదక్‌లో లబ్ధిదారులకు షాదీముబారక్‌, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ


మెదక్‌ టౌన్‌, డిసెంబరు 2: రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నిధులు కేటాయిస్తున్నామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం మెదక్‌ పట్టణంలో లబ్ధిదారులకు షాదీముబారక్‌, కల్యాణలక్ష్మి చెక్కులను స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆసరా, రైతుబంధు, పెన్షన్లు వంటి సంక్షేమ పథకాలకు నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. పేదల సంక్షేమం కోసం కేసీఆర్‌ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఎస్సీ సబ్‌ప్లాన్‌ను రాష్ట్రంలో వందశాతం అమలు చేస్తున్నామని తెలిపారు.  ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా 80 నుంచి 90 శాతం సబ్సిడీపై రుణాలను అందజేస్తున్నట్లు  తెలిపారు. ఖర్చు చేసిన ఎస్సీ సబ్‌ ప్లాన్‌ నిధులపై పూర్తి పారదర్శకంగా ఉండేందుకు అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు వివరాలతో కూడిన పెన్‌డ్రైన్‌ను అందజేస్తున్నట్లు వివరించారు. యాసంగి పంటకు రూ.7,200 కోట్లను రైతుబంధు ద్వారా అందించబోతున్నామని మంత్రి వెల్లడించారు. మంత్రి వెంట జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ లావణ్యరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌, ఆర్డీవో సాయిరాం, తహసీల్దార్‌ రవికుమార్‌, మాజీ వైస్‌ చైర్మన్‌ రాగి అశోక్‌, కౌన్సిలర్లు లక్ష్మీనారాయణగౌడ్‌, బీమరి కిషోర్‌కుమార్‌, జయరాజ్‌, ఆర్కె శ్రీనివాస్‌, సమీ, వసంతరాజ్‌, నాయకులు మధుసూదన్‌రావు, పీఏసీఎస్‌ చైర్మన్‌ హన్మంతరెడ్డి, నర్సింహులు, దుర్గప్రసాద్‌, కృష్ణ, శ్రీధర్‌యాదవ్‌, రాము, వెంకటనారాయణ, జయరాంరెడ్డి, అంజద్‌, ఆరీప్‌, రాములు, అంజయ్య, రమేశ్‌గౌడ్‌, ఉమర్‌ ఉన్నారు. 


కాంప్లెక్స్‌ నిర్మాణం త్వరగా చేపట్టాలి


మెదక్‌ రూరల్‌: మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో చేపట్టిన షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణ పనులు త్వరగా చేపట్టాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. మండల పరిషత్‌ కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్‌ కింద మంజూరైన రుణాలను బుధవారం లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. మెదక్‌, హవేళిఘణాపూర్‌ మండలాలకు చెందిన 22 మంది లబ్ధిదారులకు రూ.7.5 లక్షల చెక్కులను అందజేశారు. అనంతరం షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం కోసం ప్రతిపాదించిన స్థలాన్ని పరిశీలించారు. నిర్మాణం పూర్తయిన తర్వాత షాపుల కేటాయింపుల్లో పారదర్శకత పాటించాలని సూచించారు. మంత్రి వెంట మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, జడ్పీ వైస్‌ చైర్మన్‌ లావణ్యరెడ్డి, ఎంపీపీ యమునజయరాంరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ హన్మంతరెడ్డి, ఎంపీపీ వైస్‌ చైర్మన్‌ ఆంజనేయులు, ఎంపీడీవో రాంబాబు, ఎంపీటీసీలు శ్రీహరి, ప్రభాకర్‌, మానసరాంలు, టీఆర్‌ఎస్‌ నాయకులు కిష్టయ్యతో పాటు సర్పంచ్‌లు, అధికారులు ఉన్నారు. కాగా, పంచాయతీల్లో విద్యుత్‌ దీపాల నిర్వాహణ బాధ్యతలు ప్రైవేటుకు అప్పగించవద్దని ఉమ్మడి మండల సర్పంచ్‌లు మంత్రి హరీశ్‌రావుకు వినతిపత్రాన్ని అందజేశారు. 

Updated Date - 2020-12-03T05:57:45+05:30 IST