సజ్జల వద్ద తేలని పురం పంచాయితీ!

ABN , First Publish Date - 2021-03-02T06:44:53+05:30 IST

హిందూపురం అధికార పార్టీలో నెలకొన్న కు మ్ములాటకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ముగింపు పలకలేకపోయారని తెలిసింది.

సజ్జల వద్ద తేలని పురం పంచాయితీ!

-బీ-ఫాంలు తీసుకొచ్చిన ఎమ్మెల్సీ

-అయోమయంలో నవీన నిశ్చల్‌ వర్గీయులు

-రెబల్స్‌గా బరిలో దిగేందుకు సిద్ధం


హిందూపురం టౌన, మార్చి 1: హిం దూపురం అధికార పార్టీలో నెలకొన్న కు మ్ములాటకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ముగింపు పలకలేకపోయారని తెలిసింది. ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌, వైసీపీ పార్లమెంటు నియోజకవ ర్గ అధ్యక్షుడు నవీననిశ్చల్‌ వర్గీయులు మున్సిపల్‌ ఎన్నికల్లో నామినేషన్లు దాఖ లు చేశారు. సోమవారం సాయంత్రం వ రకు బీ-ఫాంలు ఎవరి చేతికి వస్తాయోనని వైసీపీ శ్రేణులు అయోమయంలో పడ్డారు. సజ్జలతో ఎమ్మెల్సీ సమావేశమైనపుడు హిం దూపురంలోని వైసీపీ నాయకుల్లో టెన్షన నెలకొంది. సోమవారం పుట్టపర్తికి విచ్చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి వద్దకు ఎమ్మెల్సీ ఇక్బాల్‌, నవీన ని శ్చల్‌ వెళ్లారు. అక్కడ ఇద్దరికీ సర్దిచెప్పి, బీ-ఫాంలు అందజేస్తారని వైసీ పీ శ్రేణులు భావించారు. అక్కడ కూడా పంచాయితీ తేలనట్లు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల తరహాలోనే బీ-ఫాంలను ఎమ్మెల్సీ చేతికి అందజేశారు. దీంతో ఆయన హిందూపురానికి బయలుదేరారు. 18 మందికి బీ-ఫాంలు ఇవ్వాలని నవీననిశ్చల్‌ జాబితాను మున్సిపల్‌ ఎన్నికల ఇనచార్జ్‌ విశ్వేశ్వర్‌రెడ్డికి అందజేసిన వి షయం తెలిసిందే. ఎమ్మెల్సీ ఆ లిస్ట్‌ను ఖాతరు చేయనట్లు తెలిసింది. బీ-ఫాంలు తీసుకుని, హిందూపురం వచ్చారు. తాను ఇచ్చిన లిస్ట్‌ ఏమైనట్లని నవీన నిశ్చల్‌.. విశ్వేశ్వర్‌రెడ్డిని ప్రశ్నించారు. పది బీ-ఫాంలు ఇస్తారని నవీన వర్గీయులు పేర్కొంటున్నారు. ఎమ్మెల్సీ వర్గీయులు ఒక్క బీ-ఫాం కూడా నవీన చేతికి ఇచ్చే ప్రసక్తేలేదనీ, ఎమ్మెల్సీనే అన్నీ అందజేస్తారని తెలిపారు. దీంతో నవీన వర్గీయుల్లో అయోమయం నెలకొంది. మంగళవారం మున్సిపల్‌ ఎన్నికల ఇనచార్జ్‌ విశ్వేశ్వర్‌రెడ్డి హిందూపురానికి రానున్నారనీ, అప్పుడు ఏదో ఒకటి తేల్చుకుంటామని నవీన వర్గీయులు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్సీ మాత్రం అభ్యర్థుల పేర్లను మంగళవారం ప్రకటించి, బీ-ఫాంలు అందజేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీ రెబల్స్‌ తప్పకుండా బరిలో ఉంటారని ఆ పార్టీ శ్రేణులే పేర్కొంటున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా హిందూపురం వైసీపీ పంచాయితీని తేల్చలేకపోయారని పెద్ద చర్చ సాగుతోంది.


Updated Date - 2021-03-02T06:44:53+05:30 IST