పిచ్చాటూరు మండలంలో వేరుశనగ పంట పరిశీలిస్తున్న జీఎం సుబ్బయ్య
శ్రీకాళహస్తి, మార్చి 2: ఖరీఫ్ సీజన్‌లో పంపిణీకి అవసరమైన వేరుశనగకాయల సేకరణ ఈనెల 15 నుంచి జరగనుందని ఏపీసీడ్స్ జిల్లా మేనేజర్ సుబ్బయ్య తెలిపారు. మంగళవారం ఆయన పిచ్చాటూరు. నాగలాపురం మండలాల్లో పర్యటించి వేరుశనగ పంటను పరిశీలించారు. పంట దిగుబడి, విత్తన నాణ్యత బాగుందని చెప్పారు. విత్తన కాయలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర నిర్ణయించాల్సి ఉందని అన్నారు.
5 నుంచి ధాన్యం సేకరణ
ఈనెల 5 నుంచి ధాన్యం సేకరణ జరగనుందని స్థానిక ఏపీసీడ్స్(విత్తనశుద్ధి కర్మాగారం) జిల్లా మేనేజరు సుబ్బయ్య మంగళవారం చెప్పారు. రైతులు నాణ్యమైన ధాన్యం తేవాల్సి ఉందన్నారు. ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులొచ్చాక గిట్టుబాటు ధర ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు.