ఒకే ఒక జీవితం..!

ABN , First Publish Date - 2022-09-24T05:06:32+05:30 IST

అంత అవసరమైతే.. బైక్‌ పక్కన ఆపి మాట్లాడండి..! ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదు..!!

ఒకే ఒక జీవితం..!



కాస్త కఠినంగా మాట్లాడుకుందాం..!

ఒకే ఒక్క జీవితం..

పోతే తిరిగి వచ్చే సమస్య లేదు..!

ఎందుకంత నిర్లక్ష్యం..?

నీకింగా పెళ్లి కాలేదనుకో..

అమ్మానాన్న..

ఎన్నెన్ని ఆశలు పెట్టుకుని ఉంటారు..?

నీకు పెళ్లైందనుకో..

నీ కుటుంబం పరిస్థితి ఏమిటి..?

మనిషి అవయవాలు

బల్లి తోకలు కాదు..

తెగిపోయినా కాస్త పెరగడానికి..!

జీవితం జానపద చిత్రం కాదు..

ప్రాణం పోయినా.. 

మంత్రం వేయగానే తిరిగి రావడానికి..!

అలా సెల్‌ ఫోన మోగగానే..

చుట్టూ ప్రపంచాన్ని మరిచిపోతే ఎలా..?

నీ తీరుతో నీకే కాదు..

ఎంతో పద్ధతిగా వెళ్లే ఎదుటివారికీ ముప్పే..!

ఆగండి సర్‌.. ఆగండి మేడమ్‌..

అంత అవసరమైతే..

బైక్‌ పక్కన ఆపి మాట్లాడండి..!

ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదు..!!




Updated Date - 2022-09-24T05:06:32+05:30 IST