18 గ్రామాలకు ఒకే ఒక్క వీఆర్వో

ABN , First Publish Date - 2022-05-26T05:55:56+05:30 IST

ప్రభుత్వం అధికార వికేంద్రీకరణ చేసి గ్రామాల్లో సచివాలయాల వ్యవస్థను ప్రారంభించింది. అయి తే ఆశించిన స్థాయిలో గ్రామీణ ప్రజలకు సేవలు అందడం లేద న్న ఆరోపణలున్నాయి.

18 గ్రామాలకు ఒకే ఒక్క వీఆర్వో
వీఆర్వో లేని వైబీ హళ్ళి గ్రామ సచివాలయం

ప్రభుత్వ సేవలు అందక ప్రజల ఇక్కట్లు


మడకశిర రూరల్‌, మే 25: ప్రభుత్వం అధికార వికేంద్రీకరణ చేసి గ్రామాల్లో సచివాలయాల వ్యవస్థను ప్రారంభించింది. అయి తే ఆశించిన స్థాయిలో గ్రామీణ ప్రజలకు సేవలు అందడం లేద న్న ఆరోపణలున్నాయి. ప్రస్తుతం రైతులు బ్యాంకులో పంట రుణా లు రెన్యువల్స్‌ చేస్తున్నారు. మరోవైపు ఖరీఫ్‌ సీజన కూడ ప్రారంభమైంది. భూసమస్యలు, పట్టాదారు పాసుపుస్తకాలు, ఆనలైనలో వన-బీలు రాక రైతులు అవస్థలు పడుతున్నారు. గ్రామ సచివాలయాలు, తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఒక్క సచివాలయంలోనే రైతుల సమస్యలు సత్వరం పరిష్కరించాలంటే కష్టం. అలాంటిది నాలుగు సచివాలయాలకు ఒక్క వీ ఆర్వో విధులు నిర్వహిస్తున్నారు. ఈపరిస్థితుల్లో సమస్యలు పరిష్కారం కాక రైతుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. మండలం లో వైబీ హళ్ళి, మడకశిర, ఏఆర్‌ రొప్పం, ఆమిదాలగొంది సచివాలయాల పరిధిలో 18 గ్రామాలు ఉన్నాయి. 4600 మంది రైతులు ఉ న్నారు. ఏడాదిగా ఒకే ఒక్క వీఆర్వో ఈ నాలుగు సచివాలయాల పరిధిని పర్యవేక్షిస్తూ విధులు నిర్వహిస్తున్నారు. వైబీ హళ్ళి గ్రా మంలో సచివాయం ఉన్నా అక్కడికి వీఆర్వో వెళ్లకపోవడంతో, ఆ గ్రామ రైతులు వ్యయప్రయాసలకోర్చి మడకశిర తహసీల్దార్‌ కా ర్యాలయానికి వస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి  ఖా ళీగా ఉన్న సచివాలయాలకు వీఆర్వోలను నియమించాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.


రెగ్యులర్‌ వీఆర్వోను నియమించాలి..

రామాంజనేయులు, సర్పంచ, వైబీ హళ్ళి

వైబీ హళ్ళి సచివాలయానికి ఏడాదిగా వీఆర్వో లేక ఇబ్బందులు పడుతున్నాం. రెగ్యులర్‌ వీఆర్వోను  నియమించాలి. రెవెన్యూ వీఆర్వో లేక పోవడంతో  పంచాయతీలో రైతులు తీవ్ర ఇబ్బందు పడుతున్నారు. ఈ విషయం తహసీల్ధార్‌ దృష్టికి తీసుకువెళ్లినా స్పందన లేదు.


రైతు సమస్యలు పరిష్కరించాలి..

రంగప్ప, రైతు, వైబీ హళ్ళి

రైతుల సమస్యల పరిష్కరానికి  తహసీల్దార్‌ చర్యలు తీసుకోవాలి. ప్రతి చిన్న సమస్యకు వ్యయప్రయాసలకోర్చి తహసీల్దార్‌ కార్యాలయానికి రావడానికి  ఇబ్బందులు పడుతున్నాం. వీఆర్వో సచివాలయానికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి.


వీఆర్వోల కొరత ఉంది..

ఆనందకుమార్‌, తహసీల్దార్‌ 

గ్రామ సచివాలయాలకు వీఆర్వోల కొరత ఉంది. మండలంలో 24 వీఆర్వో పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం 8 పోస్టులు ఖాళీగా ఉన్నా యి.  ఖాళీగా ఉన్న సచివాలయాలకు ప్రస్తుతం ఉన్న వీఆర్వోలను సర్దుబాటు చేశాం.


Updated Date - 2022-05-26T05:55:56+05:30 IST