ఆక్రమణలకు ఓపెన

ABN , First Publish Date - 2021-11-24T06:34:37+05:30 IST

అధికార పార్టీ నాయకుల ఆక్రమణలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది.

ఆక్రమణలకు ఓపెన
నిర్మాణదశలో ఉన్న ఇల్లు

ఓపెన సైట్‌పై అధికార పార్టీ నాయకుల కన్ను..!

స్వాధీనంలో పంచాయతీ అధికారుల మీనమేషాలు

రుద్రంపేటలో అన్యాక్రాంతం అవుతున్న 63 సెంట్ల భూమి

అనంతపురంరూరల్‌, నవంబరు 23: అధికార పార్టీ నాయకుల ఆక్రమణలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది.   నగరానికి అతి సమీపంలోని రుద్రంపేట పంచాయతీలో అధికార పార్టీకి చెందిన కొంత మంది నాయకులు స్థానికంగా ఉన్నా ఓపెన సైట్‌ను ఆక్రమించేందుకు పావులు కదుపుతున్నారు. అ క్కడ సెంటు రూ.10 లక్షల పైమాటే. అంతటి విలువైన స్థలాన్ని స్వాధీనం చేసుకోవడంలో సంబంధిత పంచాయితీ అధికారులు మీనామేషాలు లెక్కిస్తున్నారు. గత కొంత కాలంగా స్థలం స్థానిక అధికార పార్టీ నాయకులు ఆక్రమిచుకున్నారని తెలిసినప్పటికీ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. 


అన్యాక్రాంతం అవుతున్న 63 సెంట్ల భూమి..

మండలంలోని రుద్రంపేట పంచాయతీ పరిధిలోని సర్వే నెంబరు-145-1బిలో 1985లో డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన అండ్‌ కంట్రీ ప్లానింగ్‌(డీటీసీపీ) నిబంధనల మేరకు 6 ఎకరాలకు పైగా లేఅవుట్‌ వేశారు. ఈక్రమంలోనే ప్రజా అవసరాల నిమిత్తం అప్పటిలోనే లేఅవుట్‌లో 63 సెంట్లు ఓపెన సైట్‌ వదిలారు. అయితే కొందరు నాయకులు గుట్టు చప్పుడు కాకుండా స్థానిక రెవెన్యూ అధికారుల సాయంతో పట్టాలు పొందారు. ఒక్కొక్కరు ఎవరి అనుకూలం కొద్దీ వారు 3 సెంట్లు, నాలుగు సెంట్ల చొప్పున మొత్తం 17 మంది పట్టాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే ఇ ద్దరు, ముగ్గురు ఇళ్ల నిర్మాణలు చేపట్టారు. ఇప్పటికే ఓ వ్యక్తి ఇల్లు కట్టుకొని నివాసముంటున్నాడు. ఇంకొక ఆయన ఇల్లు పూర్తి అయ్యే దశలో ఉండగా.. మరొక్కరికి సంబంధించిన ఇల్లు గోడలు లే శాయి. ఇలా ఎవరికి వారు ఓపెన సైట్‌లో ఇంటి నిర్మాణలు జరుపుతున్నారు. ఈ విషయం బయటకు పొక్కడంతో 2020 జూలైలో రెవెన్యూ అధికారులు పట్టాలను రద్దు చేశారు. ఈక్రమంలోనే స్థలాన్ని పంచాయతీకి అప్పగించారు. అయినా స్థానిక నాయకులు మాత్రం స్థలాన్ని వదలడం లేదు. ఇటీవల ఇంటి నిర్మాణాలకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. నాలుగు రోజుల కిందట ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం చేపడుతున్న విషయం తెలుసుకుని పంచాయతీ అధికారులు అడ్డుకున్నారు. అలా జరగడం అదొక్కసారే కాదు. పలుమార్లు అలా నిర్మాణాలు జరుగుతున్నాయి. అప్పుడు పంచాయతీ అధికారులు తూతూ మంత్రంగా అక్కడికి వెళ్లి నిర్మాణదారులను అడ్డుకోవడం తప్ప..స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. 


సెంటు రూ.10 లక్షల పైమాటే..

స్థానికంగా సెంటు స్థలం విలువ రూ.10లక్షలకు పైగానే పలుకుతోంది. అంటే 63 సెంట్లు రూ.6 కోట్లకుపైగానే ఉంటోంది. అంత విలువ చేసే స్థలం అన్యాక్రాంతం అవుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం పైన పలు విమర్శలు వినిపిస్తున్నాయి.  సమాచారం వస్తే అక్కడకు వెళ్లి అడ్డుకోవడం మినహా స్థలాన్ని స్వాధీనం చేసుకోవడం లేదు. ఇందులో రెవెన్యూ, పంచాయతీ అధికారులకు స్థలాలు ఉన్నాయన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలోనే స్థలాన్ని స్వాధీనం చేసుకోవడం లేదన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. 


చర్యలు తీసుకుంటాం

ఓపెన సైట్‌ ఆక్రమించడం తప్పు. ఇటీవల ఓ వ్యక్తి స్థలంలో ఇంటి ని ర్మాణం జరుగుతున్న విషయం తెలుసుకుని అడ్డుకున్నాం. ఈనేపథ్యంలో నే వారు ఇళ్ల నిర్మాణాలు చేపట్టకూడదని హెచ్చరించాం. అదేవిధంగా స్థానిక ప్రభుత్వ భవన నిర్మాణాలకు చర్యలు తీసుకుంటాం.

  - కృష్ట, పంచాయతీ కార్యదర్శి.



Updated Date - 2021-11-24T06:34:37+05:30 IST