పుంగనూరు ఆర్టీసీ డిపో ప్రారంభం

ABN , First Publish Date - 2021-05-07T06:26:49+05:30 IST

పుంగనూరులో 6.82 ఎకరాల్లో రూ.7.5 కోట్లతో నిర్మించిన ఆర్టీసీ డిపోను గురువారం అమరావతి నుంచి సీఎం జగన్‌, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు.

పుంగనూరు ఆర్టీసీ డిపో ప్రారంభం
ఆర్టీసీ బస్సులకు పచ్చజెండా ఊపుతున్న కలెక్టర్‌

వర్చువల్‌ విధానంలో ఓపెన్‌ చేసిన సీఎం జగన్‌ 


పుంగనూరు రూరల్‌, మే 6: పుంగనూరులో 6.82 ఎకరాల్లో రూ.7.5 కోట్లతో నిర్మించిన ఆర్టీసీ డిపోను గురువారం అమరావతి నుంచి సీఎం జగన్‌, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. పుంగనూరులో ఆర్టీసీ డిపో కావాలని పాదయాత్ర సందర్భంగా అక్కడి ప్రజలు తనను కోరారని జగన్‌ గుర్తుచేశారు. అధికారంలోకి రాగానే వారికిచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు తెలిపారు.  పుంగనూరు ప్రజల రుణం తీర్చుకున్నట్లు మంత్రి రామచంద్రారెడ్డి చెప్పారు. 


రాష్ట్రంలో ఆర్టీసీ డిపోలు మూత పడుతున్న సమయంలో పుంగనూరులో డిపోను, కడపలో కార్మికుల ఆస్పత్రిని ప్రారంభించడం సంతోషంగా ఉందని మంత్రి పేర్ని నాని అన్నారు. ఈ సందర్భంగా సీఎంకు ఎంపీ మిథున్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం బస్సులకు పూజలు చేసి  పుంగనూరు నుంచి కాణిపాకం, తిరుమల, విజయవాడ, హైదరాబాదు, బోయకొండ సర్వీసులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు ద్వారకనాథరెడ్డి, నవాజ్‌బాషా, కలెక్టర్‌ హరినారాయణన్‌, మదనపల్లె సబ్‌కలెక్టర్‌ జాహ్నవి, మున్సిపల్‌ చైర్మన్‌ అలీంబాషా, వైస్‌ చైర్మన్‌ నాగేంద్ర, ఆర్‌ఎం చెంగల్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌ డీఈ రాజశేఖర్‌నాయుడు, డివిజన్‌ డీఎం భాస్కర్‌రెడ్డి,  పలమనేరు డీఎస్పీ గంగయ్య, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజరెడ్డి, నాయకులు  నాగభూఫణం, భాస్కర్‌రెడ్డి, వెంకటరెడ్డియాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-05-07T06:26:49+05:30 IST