పంచాయతీ గల్లా పెట్టె ఖాళీ

ABN , First Publish Date - 2021-11-27T06:18:30+05:30 IST

పంచాయతీలకు కొంతకాలంగా ఆర్థిక సంఘం నిధులే ఆధారమవుతున్నాయి. 14వ ఆర్థిక సంఘం నిధులు వచ్చినట్లే వచ్చి వెనక్కి వెళ్లాయి.

పంచాయతీ గల్లా పెట్టె ఖాళీ

వెనక్కు మళ్లిన 14, 15వ ఆర్థిక సంఘం నిధులు


ఉరవకొండ, నవంబరు 26: పంచాయతీలకు కొంతకాలంగా ఆర్థిక సంఘం నిధులే ఆధారమవుతున్నాయి. 14వ ఆర్థిక సంఘం నిధులు వచ్చినట్లే వచ్చి వెనక్కి వెళ్లాయి. 15వ ఆర్థిక సంఘం నిధులు వచ్చాయని.. ము ఖ్యమైన పనులు చేయచ్చని పంచాయతీ పాలకవర్గాలు అనుకున్నాయి. వ ర్షాలు, ఎన్నిక నియమావళి తదితర ఆటంకాలు తొలిగాక పనులు చేయాల ని సర్పంచలు భావించారు. అదే ఇప్పుడు శాపంగా మారి పంచాయతీలకు తెలియకుండానే నిఽధులు వెనక్కిపోయాయి. ప్రస్తుతం ఉరవకొండ నియోజ కవర్గ పరిధిలోని గ్రామ పంచాయతీలలో పలు సమస్యలు తిష్టవేశాయి. గ్రామాల్లో తాగునీటి సరఫరా, వీధి దీపాలు, పారిశుధ్య పనుల నిర్వహణ, పంచాయతీ విధుల్లో ముఖ్యమైన ఆయా పనులు చేయాలంటే నిధులు అ వసరమని చెబుతున్నారు. సర్పంచ పనులు చేస్తున్నా సీఎ్‌ఫఎంఎస్‌ ద్వారా చెల్లింపులు అంతంత మాత్రంగా ఉన్నాయి. దీంతో పనులు చేయడానికి ఎ వరూ ముందుకు రావడం లేదు. గతంలో చేసిన పనులకు బిల్లులు రావ డం లేదని పలువురు సర్పంచలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కేంద్ర ప్రభు త్వం విడుదల చేసిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఎలా తీసుకుంటుందని, పంచాయతీని ఎలా అభివృద్ధి చేయాలని వారు ప్రశ్నిస్తున్నారు. 


రూ.80 లక్షలు వెనక్కి వెళ్లాయి

అంజలి, సర్పంచ, కౌకుంట్ల

మా పంచాయతీ నుంచి 14, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.80 లక్షల దాకా వెనక్కి పోయాయి. కేంద్రం ఇచ్చే నిధులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం అన్యాయం. పంచాయతీకి ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. వెనక్కి వెళ్లిన నిధులను వెంటనే పంచాయతీల ఖాతాకు జమచేయాలి. 


సర్పంచలకు తెలియకుండానే నిధులు మాయం:

నెట్టెం సరస్వతి, సర్పంచ, పెద్దముష్టూరు 

సర్పంచలకు తెలియకుండానే పంచాయతీ ఖాతాలోని నిధులను తీయడం అన్యాయం. మాది మైనర్‌ పంచాయతీ కావడంతో ఆర్థిక సంఘం నిధులే ఆధా రం. పంచాయతీ ద్వారా ఆదాయం అంతంత మాత్రం గానే ఉంది. తాగునీటి సరఫరా, పారిశుధ్య పనులకు కుడా ఇబ్బందిగా ఉంది. 


Updated Date - 2021-11-27T06:18:30+05:30 IST