అన్నప్రసాన కార్యక్రమంలో పరిటాల శ్రీరామ్‌కు షాకిచ్చిన తనయుడు

ABN , First Publish Date - 2021-04-24T05:07:10+05:30 IST

హైదరాబాద్: అనంతపురం తెలుగుదేశం పార్టీ నాయకుడు పరిటాల శ్రీరామ్‌‌కు ఆయన కుమారుడు రవీంద్ర షాకిచ్చాడు.

అన్నప్రసాన కార్యక్రమంలో పరిటాల శ్రీరామ్‌కు షాకిచ్చిన తనయుడు

హైదరాబాద్: అనంతపురం తెలుగుదేశం పార్టీ నాయకుడు పరిటాల శ్రీరామ్‌‌కు ఆయన కుమారుడు రవీంద్ర షాకిచ్చాడు. అన్నప్రసాన కార్యక్రమంలో రవీంద్ర కత్తి చేత పట్టుకోవడంతో తండ్రి శ్రీరామ్‌‌సహా అంతా షాకయ్యారు. ఒక్కసారిగా షాక్‌కు గురైన సమయంలో తీసిన పరిటాల శ్రీరామ్ ఫొటో వైరల్ అయింది. ఈ కార్యక్రమానికి బంధువులతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అన్న ప్రాసన కార్యక్రమంలో పుస్తకాలు, డబ్బులతో పాటు అనేక వస్తువులు పెట్టినా రవీంద్ర నేరుగా కత్తిని పట్టుకున్నాడు. ఆ సమయంలో శ్రీరామ్‌ ఎక్స్‌ప్రెషన్స్ చూసి అంతా నవ్వుకున్నారు. 

Updated Date - 2021-04-24T05:07:10+05:30 IST