గ్రామాల్లో పాక్షిక లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2021-05-10T05:30:00+05:30 IST

గ్రామాల్లో పాక్షిక లాక్‌డౌన్‌

గ్రామాల్లో పాక్షిక లాక్‌డౌన్‌
లాక్‌డౌన్‌తో చేవెళ్లలో జనం లేక బోసిపోయిన ప్రధాన రోడ్డు

ఆమనగల్లు/మాడ్గుల: కరోనా కట్టడికి గ్రామాలు, పట్టణాల్లో పాక్షిక లాక్‌డౌన్‌ విధించేందుకు మున్సిపాలిటీలు, పంచాయతీలు తీర్మానాలు చేస్తున్నాయి. ఆమనగల్లులో సోమవారం లాక్‌డౌన్‌ ప్రారంభమైంది. మే 24వ తేదీ వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని మున్సిపల్‌ చైర్మన్‌ రాంపాల్‌నాయక్‌, వైస్‌చైర్మన్‌ దుర్గయ్య, వర్తక సంఘం అధ్యక్షుడు తిరుపతయ్య తెలిపారు. దుకాణాలు, నిర్వాహకులు 2గంటలకల్లా మూసివేయాలని తీర్మానించారు. శ్రీశైలం-హైదరాబాద్‌ హైవే బోసిపోయింది. కడ్తాలలో లాక్‌డౌన్‌ను పొడిగించారు. 22వ తేదీ వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని సర్పంచ్‌ జి.లక్ష్మీనర్సింహారెడ్డి తెలిపారు. మైసిగండి మైసమ్మ ఆలయ దర్శనాలు నిలిపివేశారు. 22వ తేదీ వరకు భక్తులకు అనుమతి లేదని ఫౌండర్‌ ట్రస్టీ సిరోలి పంతూ, ఈవో స్నేహలత తెలిపారు. మాడ్గుల మండలం అవురుపల్లిలో సోమవారం నుంచి లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు సర్పంచ్‌ బి.అలివేలు తెలిపారు. ఉదయం 6 నుంచి 9గంటల వరకు సాయంత్రం 6 నుంచి 7గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరవాలన్నారు. లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలని కోరారు.


  • చేవెళ్లలో కొనసాగుతున్న లాక్‌డౌన్‌


చేవెళ్ల/శంకర్‌పల్లి/మొయినాబాద్‌ రూరల్‌/కందుకూరు: నాలుగు రోజులుగా చేవెళ్లలో మధ్యాహ్నం నుంచి లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు. సోమవారం చేవెళ్ల సర్పంచ్‌ బండారు శైలజాఆగిరెడ్డి దుకాణాల బంద్‌ను పర్యవేక్షించారు. పంచాయతీ తీర్మానం మేరకు లాక్‌డౌన్‌ పాటిస్తున్నట్టు తెలిపారు. కరోనా కట్టడికి శంకర్‌పల్లిలో లాక్‌డౌన్‌ విధిస్తున్నామని మున్సిపల్‌ చైర్మన్‌ విజయలక్ష్మిప్రవీన్‌కుమార్‌ తెలిపారు. సోమవారం నుంచి 14రోజుల పాటు ప్రతి రోజూ ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకే దుకాణాలు తెరుస్తారన్నారు. కందుకూరు మండలం నేదునూరు, అగర్‌మియాగూడలో లాక్‌డౌన్‌ను ప్రకటించారు. సర్పంచ్‌లు కాసుల రామక్రిష్ణారెడ్డి, ఇ.భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ అవసరం ఉంటేనే ప్రజలు బయటకు రావాలని లేకుంటే రావొద్దని తెలిపారు. ఉదయం 11గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరవాలని తీర్మానించారు. మొయినాబాద్‌లో ప్రతీ సోమవారం నిర్వహించే అంగడిని ఐదు వారాలు రద్దు చేస్తున్నట్టు పంచాయతీ నిర్ణయించింది. దుకాణదారులకు నోటీసులు జారీ చేసి, చాటింపు వేయించారు. ఉపసర్పంచ్‌ రాజే్‌షగౌడ్‌ మాట్లాడుతూ.. అంగడి పెడితే కరోనా ఎక్కువ మందికి సోకే ప్రమాదం ఉందనే తాత్కాలికంగా రద్దు చేశామన్నారు. పంచాయతీ కార్యదర్శి సుభాకర్‌రెడ్డి, వార్డు సభ్యులు ఉమర్‌, కంజర్ల శ్రీను పాల్గొన్నారు.


  • షాద్‌నగర్‌లో నియోజకవర్గ గ్రామాల్లో...


కేశంపేట/కొందుర్గు: కేశంపేట మండలం వేములనర్వలో ఈ నెల 20వ తేదీ వరకు లాక్‌డౌన్‌ విధించారు. దుకాణాలు, హోటళ్లు సమయ పాలన పాటించాలని కోరారు. సర్పంచ్‌ మంజులమల్లే్‌షయాదవ్‌ గ్రామంలో తిరిగి లాక్‌డౌన్‌కు సహకరించాలని కోరారు. కార్యదర్శి హన్మంత్‌రెడ్డి, ఏఎ్‌సఐ వెంకట్‌రెడ్డి, కో-ఆప్షన్‌ సభ్యుడు మనోహర్‌గౌడ్‌, ప్రభాకర్‌రెడ్డి, రాములు, మల్లేష్‌, గణేష్‌, లక్ష్మయ్య ఉన్నారు. కొందుర్గులో లాక్‌డౌన్‌ను పొడిగించినట్లు పంచాయతీ కార్యదర్శి అనూష తెలిపారు. మొదట ఈ నెల 8వరకు లాక్‌డౌన్‌ పాటించారు. సోమవారం నుంచి 20వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకే దుకాణాలు తెరుస్తారని చెప్పారు. కొందుర్గు మండలం పులుసుమామిడిలో 25వ తేదీ వరకు లాక్‌డౌన్‌ ఉటుందని సర్పంచ్‌ షరీఫాబేగం, పంచాయతీ కార్యదర్శి హరికృష్ణ తెలిపారు. గ్రామంలో ఇటీవల ఓ మహిళ కరోనాతో మృతిచెందారని, మరో ఐదుగురు కరోనా చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఉదయం 6 నుంచి ఒంటిగంట వరకే దుకాణాలు తెరవాలన్నారు. జహాంగిర్‌, బల్వంత్‌రెడ్డి, ఉస్మాన్‌, రంజిత్‌గౌడ్‌, గౌస్‌పాషా, రుక్ముద్దీన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-05-10T05:30:00+05:30 IST