సభ్యత్వ నమోదులో భాగస్వాములు కావాలి

ABN , First Publish Date - 2022-01-23T05:23:34+05:30 IST

సభ్యత్వ నమోదులో భాగస్వాములు కావాలి

సభ్యత్వ నమోదులో భాగస్వాములు కావాలి
మాట్లాడుతున్న నర్సింహారెడ్డి

చేవెళ్ల/కడ్తాల్‌, జనవరి 22: కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వనమోదులో పార్టీ శ్రేణులు భాగస్వాములు కావాలని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై శనివారం ముఖ్యనాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.  ప్రతి ఒక్కరికీ రూ.2లక్షల ప్రమాదబీమా చేయిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జోష్నరెడ్డి, సున్నపు వసంతం, రఘుపతిరెడ్డి, చింపుల సత్యనారాయణరెడ్డి, బండారు ఆగిరెడ్డి, యాలాల మహేశ్వర్‌రెడ్డి, వీరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా కడ్తాల్‌ మండలంలోని మైసిగండి గ్రామంలో కాంగ్రెస్‌ డిజిటల్‌ సభ్యత్వ నమోదును టీపీసీసీ సభ్యుడు శ్రీనివా్‌సగౌడ్‌ ప్రారంభించారు.  

దేశంలో మత రాజకీయాలు సాగిస్తున్న బీజేపీ 

తలకొండపల్లి , జనవరి 22: దేశంలో బీజేపీ మత రాజకీయాలు సాగిస్తూ రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తోందని ఏఐసీసీ కార్యదర్శి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి ఆరోపించారు. మండలంలోని దేవుని పడకల్‌లో శనివారం కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు గుజ్జల మహేశ్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి వంశీచంద్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిజిటల్‌ సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతం, స్థానిక సమస్యలపై సమావేశంలో చర్చించారు. 

డీసీసీ ఉపాధ్యక్షుడిగా భగవాన్‌రెడ్డి 

తలకొండపల్లి మండలంలోని చౌదర్‌పల్లి గ్రామానికి చెందిన భగవాన్‌రెడ్డి డీసీసీ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి జారీ చేసిన నియామక ఉత్తర్వులను శనివారం పడకల్‌లో జరిగిన సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌రెడ్డి అందజేశారు.  

Updated Date - 2022-01-23T05:23:34+05:30 IST