శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు ప్రయాణికుల తాకిడి

ABN , First Publish Date - 2022-06-28T04:35:20+05:30 IST

కొవిడ్‌ మహమ్మారి వల్ల రెండేళ్లుగా శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు ప్రయాణికుల తాకిడి

  • జాతీయంగా, అంతర్జాతీయంగా పెరిగిన రాకపోకలు
  • అత్యధికంగా మే 15న 401 విమానాలు, 17.5 లక్షల మంది ప్రయాణం


శంషాబాద్‌ రూరల్‌, జూన్‌ 27: కొవిడ్‌ మహమ్మారి వల్ల రెండేళ్లుగా శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గిన విషయం తెల్సిందే. అయితే ఆ తరువాత తిరిగి విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మే 15న జాతీయ, అంతర్జాతీయ ప్రయాణాల్లో 401 విమానాలు రాకపోకలు సాగించగా అందులో దాదాపు 17.5 లక్షల మంది ప్రయాణించారని జీఎంఆర్‌ సీఈవో  ప్రదీప్‌ ఫణీకర్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.  మేలో దేశీయ ప్రయాణికుల సంఖ్య 93ు, అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య 86ుగా ఉందన్నారు. జూన్‌ 10న 10వేల మంది అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగించారన్నారు. దక్షిణ, మధ్య భారతదేశం నుంచి ప్రయాణించేవారికి ప్రధాన కేంద్రంగా, అతిపెద్ద ట్రాన్సిట్‌ హబ్‌గా జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టు అవతరించిందని తెలిపారు. కొవిడ్‌ మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో దేశీయ, విదేశీయ ప్రయాణికుల సంఖ్య భారీసంఖ్యలో పెరుగుతోందని చెప్పారు. మే 15న దేశీయ ప్రయాణికుల సంఖ్య 53వేలు దాటిందన్నారు. గతంలో 55 దేశీయ గమ్యస్థానాలకు ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 70కి పెరిగిందని చెప్పారు. ఇటీవల గుల్బర్గా, హుబ్లిలకు కొత్త సర్వీసులు ప్రారంభమయ్యాయని తెలిపారు.  


Updated Date - 2022-06-28T04:35:20+05:30 IST