నేరాల అదుపునకు ప్రజలు సహకరించాలి

Jul 25 2021 @ 00:00AM
మాట్లాడుతున్న ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌గౌడ్‌

కీసర రూరల్‌: నేరాల అదుపునకు ప్రజలు సహకరించాలని కీసర పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌గౌడ్‌ అన్నారు. దొంగతనాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నాగారంలోని ముప్పు ఎల్లారెడ్డి ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం ‘సేఫ్‌ నాగారం మున్సిపల్‌’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ పరిధిలోని వివిధ కాలనీల అధ్యక్షకార్యదర్శులు మాట్లాడుతూ.. అన్ని కాలనీల్లో పోలీసుల గస్తీని ముమ్మరం చేయాలని, ప్రజా ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని పేర్కొన్నారు. గృహనిర్మాణ రంగంలో పనిచేసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికుల వివరాలు సేకరించటంతో పాటు వారిపై నిఘా ఉంచాలన్నారు. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌గౌడ్‌ మాట్లాడుతూ.. నాగారంను సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మున్సిపల్‌ నిధుల నుంచి రూ.50లక్షలు కేటాయించి ప్రధాన రోడ్డులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు.  మున్సిపల్‌ చైర్మన్‌ కౌకుంట్ల చంద్రారెడ్డి మాట్లాడుతూ.. దొంగతనాల నిర్మూలనకు పురపాలక ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్య పరుస్తున్నామన్నారు. కాలనీల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై స్థానికులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో నాగారం మున్సిపల్‌ కౌన్సిలర్లు శ్రీనివా్‌సగౌడ్‌, శ్రీనివా్‌సగౌడ్‌, శ్రీనివాస్‌, కో-ఆప్షన్‌ సభ్యులు అశోక్‌గౌడ్‌, పాషా, ఎస్‌ఐలు రాజు, రమేష్‌, శోభన్‌, నాయకులు శ్రీనివాస్‌, సాయినాథ్‌గౌడ్‌ కాలనీల అధ్యక్షకార్యదర్శులు పాల్గొన్నారు.

Follow Us on: