పీఆర్‌సీ అమలు చేయాలి : యూటీఎఫ్‌

ABN , First Publish Date - 2021-04-23T06:52:42+05:30 IST

ప్రభుత్వం ఉద్యోగులకు వెంటనే పీఆర్సీ అమలు చేయాలని యూటీఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు.

పీఆర్‌సీ అమలు చేయాలి : యూటీఎఫ్‌
గుంతకల్లులో ధర్నా చేస్తున్న యూటీఎఫ్‌ నాయకులు

గుంతకల్లు టౌన/కళ్యాణదుర్గం/ఉరవకొండ/తాడిపత్రి రూరల్‌/బొ మ్మనహాళ్‌, ఏప్రిల్‌ 22: ప్రభుత్వం ఉద్యోగులకు వెంటనే పీఆర్సీ అమలు చేయాలని యూటీఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. గురువారం గుంతకల్లు, కళ్యాణదుర్గం, ఉరవకొండ, తాడిపత్రి రూరల్‌, బొమ్మనహాళ్‌ తహసీ ల్దార్‌ కార్యాలయాల ఎదుట ఫెడరేషన ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 11వ వేతన కమిటీ రిపోర్టు అక్టోబ రు 2020లోనే సమర్పించినప్పటికీ అమలు చేయకుండా కాలయాపన చే స్తున్నారన్నారు. 55 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని వెంటనే అమలు చే యాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వ వైఖరి విడనాడాలన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏలను వి డుదల చేయాలన్నారు. ఆయా నిరసన కార్యక్రమాల్లో నాయకులు గుంతకల్లులో రాఘవేంద్ర, శ్రీనివాసులు, రాజ్‌కుమార్‌, శంకరయ్య, కళ్యాణదుర్గంలో ఈశ్వరయ్య, చిత్తయ్య, అబ్దుల్‌ వహాబ్‌, మంజునాథ్‌యాదవ్‌, కేశవరెడ్డి, నాగరాజు, రంగప్ప, వన్నూర్‌స్వామి, చిరంజీవి, రవిశంకర్‌, బద్దేనాయక్‌, రాజన్న, నరసింహులు, మారెప్ప, ఎర్రిస్వామి, ఉరవకొండలో సుధాకర్‌, రాజశేఖర్‌, సంజీవ్‌ కుమార్‌, శేఖర్‌, రఘు, శ్రీధర్‌, నాగరాజు, బండయ్య, జయరాములు, వేణుగోపాల్‌, రామచంద్ర, సంజప్ప పాల్గొన్నారు.

Updated Date - 2021-04-23T06:52:42+05:30 IST