బాధితులకు రూ.5లక్షల చెక్కు అందజేత

Nov 29 2021 @ 00:53AM
గాయత్రికి చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి

తిరుపతి(రవాణా), నవంబరు 28: తిరుపతి లక్ష్మీపురం కూడలి వద్ద మ్యాన్‌హోల్లో పడి మృతి చెందిన సుబ్బారావు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు. ప్రభుత్వం తరఫున మంజూరైన రూ.5లక్షల చెక్కును ఆదివారం సుబ్బారావు సతీమణి గాయత్రికి అందించారు. ఈ సందర్భంగా కన్నీరుమున్నీరైన వారిని ఎమ్మెల్యే ఓదార్చారు. తన కుమారుడికి ఉద్యోగం ఇప్పించాలని బాధితురాలు విన్నవించగా, భూమన సానుకూలంగా స్పందించారు. డిప్యూటీ మేయర్‌ ముద్రనారాయణ, కార్పొరేటర్‌ ఎస్కే బాబు, కొటూరి ఆంజనేయులు, తాళ్లూరి రత్నప్రసాద్‌, సాకం ప్రభాకర్‌, కో-ఆప్షన్‌ సభ్యురాలు రుద్రరాజు శ్రీదేవి, అర్బన్‌ తహసీల్దార్‌ వెంకటరమణ, ఈస్ట్‌ సీఐ శివప్రసాద్‌రెడ్డి, ఆర్‌ఐ రామచంద్ర తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.