కలప అక్రమ రవాణాను అడ్డుకోండి

ABN , First Publish Date - 2021-07-23T05:41:24+05:30 IST

ఇచ్ఛాపురం: ఒడిశా నుంచి ఆం ధ్రాలోకి కలప అక్రమ రవాణా కాకుండా దృష్టి సారించాలని గుం టూరుకు చెందిన ప్రధాన అటవీ సం రక్షణ అధికారి (పీసీసీఎఫ్‌) ఎన్‌.ప్రతీప్‌కుమార్‌ తెలిపారు.

కలప అక్రమ రవాణాను అడ్డుకోండి
ఇచ్ఛాపురం: పురుషోత్తపురం చెక్‌పోస్టు వద్ద రికార్డులు పరిశీలిస్తున్న పీసీసీఎఫ్‌ ప్రతీప్‌కుమార్‌

 పీసీసీఎఫ్‌ ప్రతీప్‌కుమార్‌ 

ఇచ్ఛాపురం: ఒడిశా నుంచి ఆం ధ్రాలోకి కలప  అక్రమ రవాణా కాకుండా దృష్టి సారించాలని గుం టూరుకు చెందిన ప్రధాన అటవీ సం రక్షణ అధికారి (పీసీసీఎఫ్‌) ఎన్‌.ప్రతీప్‌కుమార్‌ తెలిపారు. గురువారం పురుషోత్తపురం చెక్‌పోస్టు వద్ద గల అటవీశాఖ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానంగా ఎడ్లబళ్లపై లక్షలాది రూపాయల విలువచేసే ఎర్రచందనం, టేకు, ఇతర కలప తరలిస్తుండడంతో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.  లారీల్లో కూడా కలప రవాణాకాకుండా చర్యలు తీసుకోవాలని ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. విశాఖ అటవీసంరక్షణాధికారి టి.రామ్మో హన్‌రావు, జిల్లా అటవీ అధికారి సచిన్‌ గుప్తా పాల్గొన్నారు.  ఇచ్ఛాపురంరూ రల్‌: వన్యప్రాణులను ప్రతిఒక్కరూ సంరక్షించాలని గుంటూరు, విశాఖప ట్నం ప్రధాన అటవీ సంరక్షాధికారులు(పీసీఎఫ్‌) ఎన్‌.ప్రతీప్‌కుమార్‌, టి.రామ్మోహనరా వు  తెలిపారు. తేలుకుంచిలోని  విదేశీ పక్షుల విడిది కేంద్రాన్ని జిల్లాఅటవీశా ఖాధికారి సచిన్‌ గుప్తా ఆధ్వర్యంలో సందర్శించారు.ఈ సందర్భంగా గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో విశాఖపట్నం ఫారెస్టు ఫ్లయింగ్‌ అధికా రి ఎం.సోమనాఽథం, జిల్లా అటవీ రేం జ్‌ అధికారి పి.అమ్మన్నాయుడు, టాస్క్‌ఫోర్స్‌ రేంజ్‌అధికారి పీవీ శాస్త్రీ సిబ్బంది పాల్గొన్నారు. 

 


 

Updated Date - 2021-07-23T05:41:24+05:30 IST