‘హైడ్రాక్సీ’ దుష్ప్రభావాలపై అధ్యయనం: ఐసీఎంఆర్‌

Published: Mon, 20 Apr 2020 14:53:35 ISTfb-iconwhatsapp-icontwitter-icon
హైడ్రాక్సీ దుష్ప్రభావాలపై అధ్యయనం: ఐసీఎంఆర్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 19: హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ (హెచ్‌సీక్యూ) మందుల వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అధ్యయనం చేస్తున్నట్లు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) తెలిపింది. దేశంలోని కొందరు వైద్య సిబ్బంది సొంతంగా ఈ మందులను వాడుతున్నారని, అలాంటి వారిలో ఉదర కండరాల నొప్పి, వికారం, రక్తంలో గ్లూకోజు తగ్గడం వంటి సైడ్‌ఎఫెక్ట్‌లు గుర్తించినట్లు ఐసీఎంఆర్‌లోని అంటువ్యాధుల విభాగం అధిపతి రామన్‌ గంగాఖేద్కర్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో హెచ్‌సీక్యూ వల్ల కలిగే దుష్ప్రభావాలపై అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. ఈ మందులను వేసుకుంటున్న వారి సమాచారం ఆధారంగా అధ్యయనం ప్రారంభించామన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.