భవన నిర్మాణాల్లో పురోగతి చూపించాలి

ABN , First Publish Date - 2021-07-27T06:13:52+05:30 IST

ప్రభుత్వ నిర్మిస్తున్న భవన నిర్మాణాల్లో పురోగతి చూపించాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

భవన నిర్మాణాల్లో పురోగతి చూపించాలి
వీసీలో మాట్లాడుతున్న కలెక్టర్‌ నాగలక్ష్మి


జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌


అనంతపురం,జూలై26(ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ నిర్మిస్తున్న భవన నిర్మాణాల్లో పురోగతి చూపించాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సో మవారం ఆమె కలెక్టరేట్‌ నుంచి ఆర్డీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో వీడియో కా న్ఫరెన్స్‌ నిర్వహించారు. కొవిడ్‌, ఖరీఫ్‌ సన్నద్ధత, గ్రామ సచివాయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎ్‌సఆర్‌ హెల్త్‌ క్లినిక్‌లు, బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్ల భవనాల పూర్తి, నవరత్నాలు-పేదలందరికి ఇళ్ల గ్రౌండింగ్‌, నాడు-నేడు కింద పాఠశాలల్లో జరుగుతున్న పనులు, జగనన్న విద్యాదీవెన, పచ్చతోరణం, గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.... ప్రభుత్వ భవనాలకు సంబంధించిన నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.  సచివాలయ వ్యవస్థ అమలుపై తహసీల్దార్లు, ఎంపీడీఓలు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అక్టోబరు నాటికి సచివాలయ వ్యవస్థ ప్రారంభించి రెండేళ్ల అవుతున్న క్రమంలో... సచివాలయాల్లో వచ్చిన సర్వీసులను పెండింగ్‌లో లేకుండా చూడాలన్నారు. అన్ని సచివాలయాల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించి పోస్టర్లను ప్రదర్శించడంతో పాటు ఆయా పథకాలకు అర్హత సాధించిన అబ్ధిదారుల జాబితానూ ప్రదర్శించాలన్నారు. సచివాలయాల్లో ఉద్యోగుల హాజరు పట్టికలో హాజరును నమోదు చేసి ఆ పట్టికను ప్రతిరోజూ పంపించాలన్నారు. అలా పంపని పక్షంలో సంబంధిత ఎంపీడీఓలకు నోటీసులు అందిస్తామన్నారు. సచివాలయానికి వచ్చే స్పందన గ్రీవెన్స్‌ని వారం రోజుల్లోగా పరిష్కారం చూపించాలన్నారు. కొవిడ్‌ నేపథ్యంలో జిల్లాలో సోమవారం చేపట్టే వ్యాక్సినేషన్‌ లక్ష్యాన్ని 100 శాతం చేరుకోవాలన్నారు. ఒక్క డోస్‌ కూడా పెండింగ్‌లో ఉంచకూడదన్నారు. వ్యాక్సిన్‌ వేశాక ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేయాలన్నారు.  నవరత్నాలు-పేదలందరికి ఇళ్లు కార్యక్రమంలో భాగంగా దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లోగా ఇంటి పట్టాలను పరిశీలనచేసి అర్హులైన లబ్ధిదారులకు అందించాలన్నారు. పెండింగ్‌లో దరఖాస్తులు ఎక్కువగా ఉన్నాయని... వెంటనే వాటిని పరిష్కరించాలన్నారు. మనబడి నాడు-నేడు కింద పాఠశాలల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా ఆయా పాఠశాలల్లో పెయింటింగ్‌ వేయడం, వాల్‌ఆర్ట్స్‌(బొమ్మలు వేయడం) పనులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వాటిని ఎంఈఓలు వెంటనే పూర్తీ చేయాలన్నారు. జగన్న విద్యా దీవెన పథకం కింద అర్హులను గుర్తించి అన్ని విధాలా సిద్దంగా ఉండాలన్నారు. జగనన్న పచ్చతోరణం కార్యక్రమం కింద అవెన్యూ ప్లాంటేషన్‌ చేపట్టాలన్నారు. ఖరీఫ్‌ నేపథ్యంలో ఈ-క్రాఫ్‌ బుకింగ్‌ ప్రక్రియను వేగంగా నమోదుచేయాలన్నారు. వీసీలో జేసీలు నిశాంత్‌కుమార్‌, డా. సిరి, గంగాదర్‌ గౌడ్‌, నిశాంతి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సూర్యతేజ, డీఆర్‌ఓ గాయత్రిదేవి పాల్గొన్నారు.


Updated Date - 2021-07-27T06:13:52+05:30 IST