మున్సిపల్‌ కార్మికులకు రక్షణ కల్పించరా...?

ABN , First Publish Date - 2021-05-07T06:33:14+05:30 IST

కరోనా కారణంగా ము న్సిపల్‌ కార్మి కులు మృతి చెందుతుంటే పట్టించుకోరా..? కనీస రక్షణ క ల్పించరా..? అం టూ కార్మికు లు ప్రశ్నించారు.

మున్సిపల్‌ కార్మికులకు రక్షణ కల్పించరా...?
ధర్నా చేస్తున్న మున్సిపల్‌ కార్మికులు

అనంతపురం కార్పొరేషన, మే6 :  కరోనా కారణంగా ము న్సిపల్‌ కార్మి కులు మృతి చెందుతుంటే పట్టించుకోరా..? కనీస రక్షణ క ల్పించరా..? అం టూ కార్మికు లు ప్రశ్నించారు.  నగరంలోని వివిధ సర్కిళ్లలో గురువారం మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన జిల్లా కార్యదర్శి నాగభూషణం మాట్లాడుతూ... కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ప్రమా దకరంగా విస్తరిస్తోందని ప్రభుత్వం, అధికారులు సూచిస్తున్నారన్నారు. కానీ ప్రజ ల ఆరోగ్యం కోసం శ్రమించే మున్సిపల్‌ కార్మికులకు రక్షణ కల్పించలేకపోతు న్నా రని విమర్శించారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన దుర్భర పరిస్థితి నగరంలో నెలకొందని, ఇప్పటికే ఐదుగురికి కరోనా సోకిందన్నారు. అందులో ఓ  కార్మికురాలు  మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్‌ కార్మికులకు కొవిడ్‌ బీమా రూ.50లక్షలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కనీసం మా స్క్‌లు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. ఈఎస్‌ఐ తదితర సమస్యలు పరిష్క రించాలన్నారు. మూడురోజుల పాటు ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించా రు. కార్యక్రమంలో యూనియన నగరాధ్యక్షుడు నాగరాజు, తిరుమలేష్‌, ఎర్రి స్వామి, వరలక్ష్మి, ఆదినారాయణ, రవి, ప్రభాకర్‌, చలపతి తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-05-07T06:33:14+05:30 IST