వర్షార్పణం

ABN , First Publish Date - 2021-04-23T04:57:54+05:30 IST

సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం, మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో గురువారం కురిసిన అకాల వర్షానికి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.

వర్షార్పణం
వర్గల్‌ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద అకాల వర్షంతో వరదలో కొట్టుకుపోయిన ధాన్యం

 సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం, మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో గురువారం కురిసిన అకాల వర్షానికి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈదురుగాలులతో కూడిన వానకు వర్గల్‌ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఆరబోసిన ధాన్యం వరదలో కొట్టుకుపోయింది. చిన్నశంకరంపేట మండల కేంద్రంతో పాటు కొర్విపల్లి, గవ్వలపల్లి గ్రామాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది.

- వర్గల్‌/చిన్నశంకరంపేట



Updated Date - 2021-04-23T04:57:54+05:30 IST