కారుపై పడిన ధాన్యం లోడు ట్రాక్టర్‌

ABN , First Publish Date - 2021-05-09T05:48:27+05:30 IST

పెద్దాపురం, మే 8: పెద్దాపురం నుంచి గుడివాడ వెళ్లే ప్రధాన రహదారిలో ధాన్యం లోడు ట్రాక్టర్‌ తిరగబడి ఓ కారుపై పడగా ప్రాణాపాయం తప్పింది. ఎస్‌ఐ ఏ.బాలాజీ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దాపురం వైపు ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ గుడివాడ సమీపంలోకి వచ్చేసరికి ఎదురుగా

కారుపై పడిన ధాన్యం లోడు ట్రాక్టర్‌
కారుపై పడిన ధాన్యం బస్తాల లోడు

గర్భిణికి గాయాలు 

పెద్దాపురం, మే 8: పెద్దాపురం నుంచి గుడివాడ వెళ్లే ప్రధాన రహదారిలో ధాన్యం లోడు ట్రాక్టర్‌ తిరగబడి ఓ కారుపై పడగా ప్రాణాపాయం తప్పింది. ఎస్‌ఐ ఏ.బాలాజీ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దాపురం వైపు ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ గుడివాడ సమీపంలోకి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న కా రుపై బ్యాలెన్స్‌ తప్పి ధాన్యం లోడు కారుపై పడింది. ఈ ప్రమాదంలో అత్తారింటికి కాండ్రకోట గ్రామానికికారులో భర్త మణికంఠతో కలిసి వస్తున్న కందుల కుమారి అనే గర్భిణికి గాయాలయ్యాయి. దీంతో ఆమెను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు.  

Updated Date - 2021-05-09T05:48:27+05:30 IST