40 టన్నుల రేషన్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2022-07-01T06:35:29+05:30 IST

కాకినాడకు అక్రమంగా తరలిస్తున్న 40 టన్నుల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు కొవ్వూరు సివిల్‌ సప్లయిస్‌ డీటీ ఎం.కమల్‌ సుందర్‌ తెలిపారు.

40 టన్నుల రేషన్‌ బియ్యం పట్టివేత

రెండు లారీలు స్వాధీనం- ఐదుగురిపై కేసు  


కొవ్వూరు, జూన్‌ 30 : కాకినాడకు అక్రమంగా తరలిస్తున్న 40 టన్నుల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు కొవ్వూరు సివిల్‌ సప్లయిస్‌ డీటీ ఎం.కమల్‌ సుందర్‌ తెలిపారు.సివిల్‌ సప్లయిస్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం ఆద్వర్యంలో గురువారం కొవ్వూరు గామన్‌ బ్రిడ్జి టోల్‌గేట్‌ వద్ద ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఏలూరు వైపు నుంచి కాకినాడ పోర్టుకు రెండు లారీలలో తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు.ఏలూరు నుంచి ఏపీ 16 టీవై 4450 లారీలో 20 టన్నుల రేషన్‌ బియ్యం పట్టుకుని తెలంగాణ సూర్యా పేట జిల్లా మునగాల మండలం యాదారం గ్రామానికి చెందిన లారీడ్రైవర్‌ వలదాసు వీరాస్వామి, లారీ యజమాని సైదులు, బియ్యం ఎగు మతిదారుడు వలీలపై కేసు నమోదు చేశామన్నారు. ఏపీ 31 వై 4777 లారీలో 20 టన్నుల రేషన్‌ బియ్యం పట్టుకుని వత్సవాయి గ్రామానికి చెందిన లారీడ్రైవర్‌ బత్తుల గురవయ్య, బియ్యం ఎగుమతిదారుడు విజయవాడకు చెం దిన శబరిలపై కేసు నమోదు చేశామన్నారు.అక్రమంగా రేషన్‌ బియ్యం తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులపై కేసునమోదు చేసి, వారి వద్ద నుంచి 40 టన్నుల రేషన్‌బియ్యం,రెండు లారీలను స్వాధీనం చేసుకున్నామన్నారు. బియ్యాన్ని భద్రత నిమిత్తం చాగల్లు మండలం ఊనగట్లలోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. 

Updated Date - 2022-07-01T06:35:29+05:30 IST