రికవరీ పెరిగింది!

ABN , First Publish Date - 2021-05-26T05:42:32+05:30 IST

కొవిడ్‌..ఈ మాటంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. కరోనా సోకిందని తెలిసిన వెంటనే మానసికంగా కృంగిపోతున్నారు. వైరస్‌ కంటే భయమే ఎక్కువగా వారిని కృంగదీస్తోంది. మ

రికవరీ పెరిగింది!





కోలుకుంటున్న బాధితులు

స్వీయ జాగ్రత్తలతో చక్కబడుతున్న పరిస్థితులు

 అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్య నిపుణులు

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

కొవిడ్‌..ఈ మాటంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. కరోనా సోకిందని తెలిసిన వెంటనే మానసికంగా కృంగిపోతున్నారు. వైరస్‌ కంటే భయమే ఎక్కువగా వారిని కృంగదీస్తోంది. మనసులో భయంతో ఆరోగ్యం మరింతగా క్షీణిస్తోంది. దీనికితోడు ప్రచారాలు, వదంతులు నమ్మి ఎక్కువ మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కేవలం కరోనా మృతులనే తలచుకుంటున్నారు తప్పించి లక్షలాది మంది మహమ్మారి పడగ నీడ నుంచి బయటపడుతున్నారని గుర్తెరగడం లేదు. జిల్లాలో ప్రతిరోజూ ఆసుపత్రులు, కోవిడ్‌ కేర్‌ సెంటర్ల నుంచి వేలాది మంది కోలుకొని ఇళ్లకు చేరుకుంటున్నారు. స్వీయ జాగ్రత్తలు, వైద్యుల సూచనలు పాటిస్తే ఐదు నుంచి పది రోజుల్లోనే కోలుకొని ఇళ్లకు చేరుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కొవిడ్‌ వచ్చిందని మానసిక ఆందోళన, అధైర్యం వంటివి లేకుండా మనోనిబ్బరంతో ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. జిల్లాలో గత నాలుగు రోజులుగా కొత్త కేసులతో సమానంగా రికవరీ రేటు ఉంది. ఇది శుభ పరిణామమని...రానున్న రోజుల్లో మరింత పురోగతి సాధ్యమని వైద్యులు పేర్కొంటున్నారు. కరోనా అనుమానిత లక్షణాలు బయటపడినా చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. అటువంటి వారు ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి వైద్యసేవలు పొందితే స్వల్పకాలంలో కోరుకునే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. పాజిటివ్‌ నిర్థారణ జరిగిన వెంటనే ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న వారు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. 


పోషకాహారం, విశ్రాంతి ఎంతో ముఖ్యం..

కరోనా వైరస్‌ సోకిన వ్యక్తికి పోషకాహారం, తగిన విశ్రాంతి అవసరం. చిన్న జ్వరమే కదాని నిర్లక్ష్యం చేయకూడదు.  లో పాజిటివ్‌ నిర్థారణ జరిగినా కనీసం పది రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉండాలి. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉండి, ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే  వైద్యులను సంప్రదించాలి. ఇప్పుడిప్పుడే రికవరీ రేటు పెరుగుతోంది. ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయిన వారు పౌష్టికాహారం తీసుకోవాలి. ఉదయం, సాయంత్రం శ్వాసకోస వ్యాయామం చేయాలి. స్ర్పైరోమీటరు కొనుగోలు చేసుకొని.. ట్యూబ్‌ ద్వారా మూడు బాల్స్‌ను కనీసం 4 నుంచి 5 సెకన్లు ఊపిరిపీల్చుకోవాలి. ఇలా రోజుకు ఒకటి రెండు సార్లు చేయడం ద్వారా మన ఊపిరిత్తులు ఆరోగ్యంగా ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవచ్చు. ముఖ్యంగా జ్వరం వచ్చి తగ్గిపోయినా... ముందు జాగ్రతలు పాటించి కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకొని వైద్యులను సంప్రదిస్తే రికవరీ వేగంగా ఉంటుంది. చిన్న జ్వరమే కదాని జాప్యం చేసి, ఆక్సిజన్‌ లెవెల్స్‌ తగ్గిన తరువాత ఆసుపత్రులకు వచ్చేవారిని వైద్యులు కూడా కాపాడలేకపోతున్నారు. రికవరీ అయినవారు కోవిడ్‌-19 నిబంధనలు యథావిధిగా పాటించాలి. భౌతిక దూరం, మాస్క్‌ ధరించడం, శానిటైజర్ల వినియోగం తప్పనిసరి. 

- డాక్టర్‌ హేమంత్‌, జెమ్స్‌ ప్రభుత్వ నియమిత సూపరింటెండెంట్‌



Updated Date - 2021-05-26T05:42:32+05:30 IST