అక్రమ వెంచర్‌లో హద్దురాళ్ల తొలగింపు

ABN , First Publish Date - 2021-05-11T05:18:09+05:30 IST

అక్రమ వెంచర్‌లో హద్దురాళ్ల తొలగింపు

అక్రమ వెంచర్‌లో హద్దురాళ్ల తొలగింపు

యాచారం: యాచారంలోని సర్వే నెంబర్‌ 12, 13, 445, 446 సర్వే నెంబర్‌లలో గల అక్రమ వెంచర్‌లో సోమవారం ఈవోఆర్డీ శ్రీలత, పంచాయతీ కార్యదర్శి సురేష్‌ రెడ్డి హద్దురాళ్లను తొలగించారు. అనుమతులు లేకుండా వెంచర్‌ ఏర్పాటుచేసిన వి షయం తెలుసుకున్న ఈవోఆర్డీ, పంచాయతీ కార్యదర్శి పంచాయతీ కార్మికులతో వెళ్లి ప్లాట్ల కోసం వేసిన హద్దురాళ్లను తొలగించి పంచాయతీ కార్యాలయం ఆవరణలో వేశారు. నిబంధనలకు విరుద్ధంగా వెంచర్‌ ఏర్పాటు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఈవోఆర్డీ పేర్కొన్నారు. డీటీసీపీ, హెచ్‌ఎండీఏ లేఅవుట్‌ లేకుండా ఉన్న వెంచర్లలో ప్లాట్లు కొంటే జనం ఇబ్బందుల పాలవుతారనే విషయం రియల్‌ వ్యాపారులకు తెలిసీ అక్రమ వెంచర్‌ ఏర్పాటు చేయడం తగదన్నారు.

Updated Date - 2021-05-11T05:18:09+05:30 IST