మృతకణాలను వదిలించేందుకు!

Published: Sat, 24 Apr 2021 11:55:49 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మృతకణాలను వదిలించేందుకు!

ఆంధ్రజ్యోతి(24-04-2021)

ఆరోగ్యాన్నే కాదు అందాన్నీ పెంచుతుంది యాపిల్‌. విటమిన్లు, లవణాలు ఎక్కువగా ఉండే యాపిల్‌ చర్మ కణాలు దెబ్బతినకుండా చూసి చర్మాన్ని తాజాగా, యవ్వనంగా మారుస్తుంది. స్కిన్‌ టోనర్‌గానూ పనికొచ్చే యాపిల్‌తో చర్మాన్ని మెరిపించేందుకు ఏం చేయాలంటే...


- కొల్లాజెన్‌ ఎక్కువగా ఉండే యాపిల్‌ మంచి టోనర్‌గా పనిచేస్తుంది. చర్మాన్ని కాంతిమంతంగా చేస్తుంది.


- ముఖం మీద యాపిల్‌ గుజ్జు రాసుకొని ఆరిన తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం మృదువుగా కనిపిస్తుంది. జిడ్డు కూడా వదులుతుంది.


- యాపిల్‌ ముక్కతో ముఖం మీద రుద్దుకుంటే ముడతలు, మచ్చలు తొలగిపోతాయి. చర్మం జీవం పొందుతుంది.


- టేబుల్‌ స్పూన్‌ తేనె, సగం యాపిల్‌, టేబుల్‌ స్పూన్‌ ఓట్‌మీల్‌ కలిపి స్క్రబ్‌ తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమం మృతకణాలను తొలగించి చర్మాన్ని సున్నితంగా మారుస్తుంది.


- రెండు టీ స్పూన్ల యాపిల్‌ గుజ్జు, ఒక టీ స్పూన్‌ చొప్పున దానిమ్మ రసం, యోగర్ట్‌ కలిపిన మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే మూడతలు తగ్గిపోతాయి. కొత్త చర్మ కణాల ఉత్పత్తికి కారణమవుతుంది. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.