ముదురుతున్న వివాదం!

ABN , First Publish Date - 2021-06-15T05:22:12+05:30 IST

దవళపేటలో శ్మశానవాటిక ఆక్రమణలపై అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తు తున్నాయి. రోజురోజుకూ వివాదం జఠిలమవుతోంది. ఇందుకు సంబంధించి గ్రామస్థులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

ముదురుతున్న వివాదం!
ఆక్రమణలకు గురైన శ్మశానవాటిక స్థలం



 శ్మశానవాటిక స్థలం ఆక్రమణపై పరస్పర ఫిర్యాదులు

ఆందోళనలో గ్రామస్థులు

(జి.సిగడాం)

దవళపేటలో శ్మశానవాటిక ఆక్రమణలపై అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తు తున్నాయి. రోజురోజుకూ వివాదం జఠిలమవుతోంది. ఇందుకు సంబంధించి గ్రామస్థులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామంలో ఉన్న శ్మశానవాటికకు ఇటీ వల రహదారి నిర్మించారు. ఇందుకుగాను రైతులు పేడాడ జనార్దనరావు, వాసుదే వరావులు తమ జిరాయితీ భూమిలో 12 అడుగులు ఇచ్చారు. గ్రామానికి చెందిన వైద్యుడు పొన్నాడ జోగినాయుడు తన సొంత నిధులతో రహదారి నిర్మించారు. అయితే అదే గ్రామానికి చెందిన యెన్ని పారన్నాయుడు, ఆయన కుమారుడు రామకృష్ణలు రహదారిని ఐదు అడుగులు తవ్వి తమ భూమిలో కలుపుకున్నట్టు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే శ్మశానవాటికలో మూడు సెంట్ల భూమిని ఆక్రమించుకున్నారని..దీనిపై దర్యాప్తు చేయాలని సోమవారం జిల్లా అధికారులకు గ్రామస్థులు ఫిర్యాదుచేశారు. ఎటువంటి అనుమతి లేకుండా తమ భూమిలో రాత్రికి రాత్రే రహదారి నిర్మించారని పారన్నాయుడు చెబుతున్నారు. దీనిపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు. వివాదం ముదరకుండా వీలైనంత త్వరగా సమస్యకు పరిష్కార మార్గం చూపాలని గ్రామస్థులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.  




Updated Date - 2021-06-15T05:22:12+05:30 IST