ఆర్టీసీ కార్మికులను పట్టించుకోండి

ABN , First Publish Date - 2021-05-11T05:26:28+05:30 IST

కరోనా కష్టకాలంలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ జాతీయ మజ్దూర్‌ యూనియన్‌ (టీజేఎంయూ) నాయకులు డిమాండ్‌ చేశారు. టీజేఎంయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సంగారెడ్డి డిపో ఎదుట కార్మికులు సోమవారం ఎర్రరిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు.

ఆర్టీసీ కార్మికులను పట్టించుకోండి
సంగారెడ్డి బస్‌ డిపో ఎదుట నిరసన తెలుపుతున్న కార్మికులు

తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిని కొవిడ్‌ దవాఖానాగా మార్చాలి

డిపోల ఎదుట టీజేఎంయూ ఆధ్వర్యంలో నిరసనలు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి సంగారెడ్డి, మే 10: కరోనా కష్టకాలంలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ జాతీయ మజ్దూర్‌ యూనియన్‌ (టీజేఎంయూ) నాయకులు డిమాండ్‌ చేశారు. టీజేఎంయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సంగారెడ్డి డిపో ఎదుట కార్మికులు సోమవారం ఎర్రరిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. తొలుత కరోనాతో చనిపోయిన కార్మికులకు నివాళులర్పించారు. అనంతరం డిపో కార్యదర్శి బసవేశ్వర్‌ మాట్లాడుతూ కరోనాతో ఆర్టీసీ కార్మికులు మృతిచెందుతున్నా ప్రభుత్వం పట్టించుకోవంలేదని విమర్శించారు. కార్మికుల సంక్షేమం కోసం తార్నాక ఆసుపత్రిని కొవిడ్‌ ఆసుపత్రిగా మార్చాలని ఆయన డిమాండ్‌ చేశారు. కొవిడ్‌తో మృతిచెందిన ప్రతీ కార్మికుడికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ఆయన కోరారు. ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు ఎన్‌95 మాస్కులు, చేతిగ్లౌజ్‌లు, శానిటైజర్‌ అందజేయాలని డిమాండ్‌ చేశారు. కరోనా బారినపడిన సిబ్బందికి 21 రోజులు ప్రత్యేక సెలవులు మంజూరు చేయాలని కోరారు. డిపో కోశాధికారి రవినేత, నాయకులు సీహెచ్‌ఎ్‌సరెడ్డి, కిషన్‌, ప్రమీల, కృష్ణకుమార్‌, భిక్షపతి, ఆంజనేయులు, ఉస్మాన్‌, హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-11T05:26:28+05:30 IST