రైతుల సమస్యలపై ప్రభుత్వ మెడలు వంచుతాం

ABN , First Publish Date - 2022-07-01T06:34:36+05:30 IST

రైతాంగ సమస్యలను ఎలుగెత్తి చాటడం ద్వారా ప్రభు త్వం మెడలు వంచుతామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ ఎన్‌ వర్మ చెప్పారు.

రైతుల సమస్యలపై ప్రభుత్వ మెడలు వంచుతాం

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ

పిఠాపురం, జూన్‌ 30: రైతాంగ సమస్యలను ఎలుగెత్తి చాటడం ద్వారా ప్రభు త్వం మెడలు వంచుతామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ ఎన్‌ వర్మ చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు అన్ని విషయాల్లోనూ దగాయే జరిగిందని విమర్శించారు. పిఠాపురం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో గురువారం సాయంత్రం నిర్వహించిన సమావేశం లో ఆయన మాట్లాడుతూ 2వ తేదీన జగ్గంపేటలో జరిగే రైతుపోరు సభకు పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీగా రైతులు తరలిరావాలని కోరారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సభలో చర్చిస్తామని తెలిపారు.  సమావేశంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు అల్లుమల్లు విజయకుమార్‌, జవ్వాది జోగేశ్వరరావు, ఎలుబండి రాజారావు,సకుమళ్ల గంగాధర్‌, బర్ల అప్పారావు, జ్యోతుల సతీష్‌, మాదేపల్లి శ్రీను, నల్లా శ్రీను తదితరులు పాల్గొన్నారు.

రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వం

ప్రత్తిపాడు: రాష్ట్రంలో రైతులను ప్రభుత్వం అన్నివిధాలా ఇబ్బందులకు గురి చేస్తుందని తెలుగుదేశం పార్టీ కాకినాడ పార్లమెంటరీ కమిటీ ఉపాధ్యక్షుడు కొ మ్ముల కన్నబాబు, తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లాగోపిలు విమర్శి ంచారు. స్ధానిక టీడీపీ కార్యాలయం వద్ద ఇన్‌చార్జ్‌ వరుపుల రాజా ఆధ్వర్యంలో గురువారం రైతుపోరు పోస్టర్‌లను విడుదల చేశారు.  రైతాంగ సమస్యలపై జులై 2న జగ్గంపేటలో నిర్వహించే రైతుపోరు సమావేశాన్ని నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ అమరాది వెంక ట్రావు, రొంగల సూర్యారావు, యాళ్ళ జగదీష్‌, సూర్నీడి  సురేష్‌ పాల్గొన్నారు. 

రైతుపోరుకు తరలిరండి : శ్రీనుబాబు పిలుపు

సామర్లకోట: తులగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు రైతుపోరు మహాసభ జగ్గంపేట జాతీయ రహదారిలో శ్రీచైతన్య విద్యా సంస్థ ఆవరణలో జూలై 2న శనివారం పెద్దఎత్తున నిర్వహించనున్నందున ఉమ్మడి తూర్పు. పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన 35 నియోజకవర్గాల నుంచి రైతులు, రైతుకూలీలు, టీడీపీ నాయకులు, సానుభూతి పరులు అధికసంఖ్యలో తరలిరావాలని కాకినాడ పార్లమెంటరీ తెలుగు రైతు కమిటీ అధ్యక్షుడు పాలకుర్తి శ్రీనుబాబు పిలుపునిచ్చారు. 

టీడీపీ విజయానికి సమన్వయంతో కృషి

ఏలేశ్వరం: వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను  ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లాలని తెలుగు రైతు రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి జ్యోతుల పెదబాబు అన్నారు. గురువారం టీడీపీ రాష్ట్ర ఎస్సీసెల్‌ కార్యదర్శి నూకతాటి ఈశ్వరుడు అధ్యక్షతన మండల పరిధిలోని లింగంపర్తి గ్రామంలో పార్టీ సమావేశం, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. జ్యోతుల ముఖ్యఅతిథిగా హాజరై సభ్యత్వ నమోదును ప్రారంభించి పార్టీ శ్రేణులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పెంటకోట శ్రీధర్‌, పిరమలకోవెల రాము, సింగలూరి చినబాబు, బెల్లాల అప్పలరాజు, సుందరపల్లి శ్రీను, నరేష్‌, పతేటి రత్నం, తదితరులు పాల్గొన్నారు. 

వైసీపీ పాలనలో వ్యవసాయ రంగం నిర్వీర్యం

వైసీపీ ప్రభుత్వ పాలనలో వ్యవసాయరంగం నిర్వీర్యమై రైతుల సంక్షేమం పట్ల వివక్ష చూపుతోందని టీడీపీ మండలాధ్యక్షుడు సూతి బూరయ్య, రాష్ట్ర తెలుగురైతు విభాగం ఆర్గనైజింగ్‌ కార్యదర్శి జ్యోతుల పెదబాబు విమర్శించారు. జూలై 2న జగ్గంపేటలో 35నియోజకవర్గాల రైతులతో నిర్వహించే రైతుపోరు బహిరంగ సభకు తరలివచ్చి విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 

ఆంధ్రప్రదేశ్‌ను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిన జగన్‌: కొండబాబు

కాకినాడ సిటీ: అనాలోచిత నిర్ణయాలతో సీఎం జగన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ను ఆర్థిక సంక్షోభంలో నెట్టేశారని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు దుయ్యబట్టారు. నిత్యావసర ధరల పెరుగుదలకు నిరసనగా టీడీపీ తలపెట్టిన బాదుడే బాదుడు కా ర్యక్రమాన్ని గురువారం 29వ డివిజన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అప్పుల మీద నడుస్తోందన్నారు. ఈ మూ డేళ్లకాలంలో రూ.8లక్షల కోట్లు అప్పులు చేసిందన్నారు. కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు అమలకంటి బలరామ్‌, చొల్లంగి వీరబాబు, రవి, పద్మావతి  పాల్గొన్నారు.

వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యం : పావని

వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగింది శూన్యమని కాకినాడ జిల్లా తెలుగు మహిళాధ్యక్షురాలు సుంకర పావని విమర్శించారు. నిత్యావసరాల ధరల పెరుగుద లను  నిరసిస్తూ టీడీపీ పిలుపు మేరకు 6వ డివిజన్‌లో బాదుడే బాదుడు కార్యక్ర మం గురువారం నిర్వహించారు. అనంతరం పావని మాట్లాడుతూ వైసీపీని గెలిపిం చిన పాపానికి ప్రజలు అన్ని విధాలుగా మోసపోయారన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు సుంకర తిరుమలకుమార్‌, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.

పథకాల పేరుతో పన్నుల మోత : రామకృష్ణారెడ్డి 

పెదపూడి: పథకాల పేరుతో పన్నుల మోత మోగిస్తూ ధరల పెంపునకు పరోక్షం గా సహకరిస్తున్న ప్రభుత్వం అర్థంలేని కారణాలు చూపిస్తూ అర్హులకు కోతలు విధి స్తున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం రామేశ్వరం, అచ్చుతాపురం త్రయం గ్రామాలో బాధుడే బాదుడులో  ఆయన పాల్గొని నిరసన ర్యాలీలో ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. 

ప్రజాగ్రహం తప్పదు : యనమల కృష్ణుడు

తొండంగి: ప్రజా వ్యతిరేక విధానాలతో పాలన సాగిస్తున్న జగన్‌ ప్రభుత్వాన్ని ప్రజాగ్రహం తప్పదని  తుని నియోజకవర్గ  టీడీపీ ఇన్‌చార్జి యనమల కృష్ణుడు పేర్కొన్నారు. గురువారం దానవాయి పేట, తాటిఆకులపాలెం గ్రామాల్లో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. మండల పార్టీ అధ్యక్షులు కోడ వెంకట రమణ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇంటింటికీ కరపత్రాలు పంచారు. కార్యక్రమంలో పేకేటి హరికృష్ణ,చొక్కాహరిబాబు, నేమాల కృష్ణ, బంటుపల్లి అన్వేష్‌ పాల్గొన్నారు.

‘నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యానికి చేటు’

వేళంగి(కరప): వైసీపీ ప్రభుత్వం నాసిరకం మద్యాన్ని అంటగట్టి ప్రజల ఆరోగ్యానికి చేటు కలిగిస్తుందని టీడీపీ కాకినాడ పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాసబాబా ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు గురువారం వేళంగిలో పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన బాదుడే బాదుడు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటా తిరిగి ప్రజలకు కరపత్రాలను అందజేసి వైసీపీ సాగిస్తున్న దుష్టపాలనను వివరించారు.. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కంచి సత్తిబాబు, పితాని శ్రీను, వనుం శ్రీను, సత్యనారాయణ, చప్పిడి రాంబాబు పాల్గొన్నారు.




Updated Date - 2022-07-01T06:34:36+05:30 IST