శాస్త్రోక్తంగా వరాహస్వామి ఆలయ మహాసంప్రోక్షణ

Nov 30 2021 @ 02:22AM

తిరుమల, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): తిరుమల వరాహస్వామి ఆలయంలో సోమవారం అష్టబంధన మహాసంప్రోక్షణ శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయంలో నవంబరు 25 నుంచి 29వ తేది వరకు ఈ కార్యక్రమాలు జరిగాయి. వరాహస్వామి ఆలయ విమాన గోపురానికి బంగారుపూత పూసిన రాగి రేకులు అమర్చేందుకు బాలాలయ సంప్రోక్షణను టీటీడీ నిర్వహించింది. ఆ పనులు పూర్తికావడంతో జీర్ణోద్ధరణ, అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం వరాహస్వామి ఆలయంలో పూర్ణాహుతి, ప్రబంధ శాత్తుమొర, వేద శాత్తుమొర నిర్వహించారు. అలాగే 9.15 నుంచి 9.30 గంటల మధ్య ధనుర్లగ్నంలో అష్టబంధన మహాసంప్రోక్షణ చేపట్టారు. రాత్రి 7 నుంచి 8.30 గంటలకు వరాహస్వామి ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఈవో ధర్మారెడ్డి, డిప్యూటీఈవో రమే్‌షబాబు తదితరులు పాల్గొన్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.