ముందుకొచ్చిన సముద్రం

ABN , First Publish Date - 2020-07-06T10:23:18+05:30 IST

డొంకూరు తీరంలో ముప్పు పొంచిఉంది. రోజురోజుకు సముద్రం గ్రామంలోకి చొచ్చుకొస్తోంది.

ముందుకొచ్చిన సముద్రం

ఇచ్ఛాపురం రూరల్‌ : డొంకూరు తీరంలో ముప్పు పొంచిఉంది. రోజురోజుకు సముద్రం గ్రామంలోకి చొచ్చుకొస్తోంది. సముద్రం ముందుకొస్తుండడంతో మత్స్యకారులు ఆందోళనచెందుతున్నారు. కొద్దిరోజులుగా అలలు ఉధృతి పెరగడంతో సముద్రం అల్లకల్లోలంగా మారుతోంది. ఆదివారం ఉదయం సముద్రం ముందుకురావడంతో మత్స్యకారులు  భయాందోళనకు గురయ్యారు. శనివారం పౌర్ణమి పురస్కరించుకొని సముద్రంలో  అలల తాకిడికి ఇసుక దిబ్బలు భారీగా కోతకు గురయ్యాయి. అలల ఉధృతికి  సముద్రం నీరు ఇసుక దిబ్బలపై నుంచి  వలలు భద్రపరిచిన ప్రాంతానికి వచ్చినట్లు మత్స్యకారులు తెలిపారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ముప్పు తప్పదని ఆందోళన వ్యక్తంచేశారు. కొద్దినెలల్లో గ్రామాన్ని అలలు తాకే ప్రమాదం ఉందని పలువురు తెలిపారు. అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే డొంకూరుకు ప్రమా దం పొంచిఉందని వాపోయారు.

Updated Date - 2020-07-06T10:23:18+05:30 IST