గోప్యంగా జేఎనటీయూ ఈసీ సమావేశం

ABN , First Publish Date - 2021-06-17T06:18:27+05:30 IST

అజెండాను ప్రకటించని సభ్యులు - నిరాశలో ఉద్యోగులు, సిబ్బంది

గోప్యంగా జేఎనటీయూ ఈసీ సమావేశం
విడుదల చేసిన ఈసీ సమావేశ చిత్రం


అనంతపురం అర్బన, జూన 16 : జేఎనటీయూ అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌(ఈసీ) సమావే శాన్ని బుధవారం గోప్యంగా నిర్వహించారు. ఈసీలో తమ సమస్యలు ప్రస్తావనకు వచ్చాయా?.. పరిష్కారం లభించిందా? అంటూ జేఎనటీ యూ ఉద్యోగులు, సిబ్బంది, విద్యార్థులు ఆశగా ఎదురుచూశారు. అ యితే సమావేశం అనంతరం ఈసీ సభ్యులు ఎలాంటి ప్రకటనలు చేయకపోవడంతో వారు నిరాశకు గురయ్యారు. ఈసీ సమావేశం నిర్వహి స్తున్న ఫొటోలను విడుదల చేసినా.. ఎలాంటి విషయాలను తెలియజేకపోడంపై జేఎనటీయూ వర్గాలు మండిపడుతున్నాయి. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1 గంటవరకు నిర్వహించిన ఈ సమావేశంలో ఎంతమంది సభ్యులు పాల్గొన్నారు. ఎవరెవరు గైర్హాజర య్యారు. ఏఏ అంశాలను ప్రస్తావించారు... ఎన్నిటికి ఆమోద ముద్రప డింది... తదితర సమాచారాన్ని గోప్యంగా ఉంచడంతో వారు ఉత్కంఠ కు లోనయ్యారు. సమావేశ వివరాలను ఎప్పుడు ప్రకటిస్తారోనని వేచిచూడాల్సిన దుస్థతి నెలకొందని వారు వాపోతున్నారు.

ఆశగా ఎదురు చూసిన ఉద్యోగులు

జేఎనటీయూ ఏర్పాటు నుంచి అడ్‌హాక్‌, కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్శింగ్‌, టైం స్కేల్‌, డైలీ వేజ్‌ ప్రాతిపదికన వందల మంది ఉద్యోగులు విధు లు నిర్వహిస్తున్నారు. రెగ్యులర్‌ ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో జేఎనటీయూకి వారు ప్రాణవాయువులా మారారు. స్వీపర్‌ నుంచి టీచింగ్‌ సిబ్బంది వరకు అన్ని పోస్టుల్లో వారే కీలకం. రాష్ట్రంలోని ఇత ర విశ్వవిద్యాలయాల్లో ఈ తరహా ఉద్యోగులకు వేతనాలు పెంచారు. ఈ ఏడాది నూతన పాలకవర్గం బాధ్యతలు చేపట్టిన అనంతరం తమకూ వేతనాలు పెంచాలని పలుమార్లు వారు వీసీ, రిజిస్ర్టార్‌కు వి న్నవించారు. ఈ విషయాన్ని ఈసీలో సమావేశంలో చర్చించి నిర్ణ యం తీసుకంటామని హామీ ఇవ్వడంతో వారు ఆశలన్నీ ఈ సమావేశంపై పెట్టుకున్నారు. దీంతో శుభవార్త తెలుస్తుందని బుధవా రం రాత్రి ఉత్కంఠంగా ఎదురుచూశారు. అయితే వారికి ఎలాంటి సమాచారం లేకపోవడంతో నిరాశాలో మునిగిపోయారు.

అందుబాటులోకి రాని వీసీ, రిజిస్ర్టార్‌

ఈసీ సమావేశంలో సభ్యులు ప్రస్తావించిన అంశాలు... ఆమోదం తెలిపిన అంశాల వివరాలను మినిట్స్‌ బుక్‌లో నమోదుచేయాలి. అలా గే సమావేశం అనంతరం సభ్యులు ఆమోదం తెలిపిన వివరాలను ప్రకటన ద్వారా మీడియాకు తెలియజేయాలి. అదేవిషయాలను జేఎనటీయూ ఉద్యోగులు, సిబ్బందికి వివరించాలి. అయితే ఎలాంటి విషయాలను తెలపకుండా గోప్యతను పాటించడం ఏంటని ఉద్యోగు లు మండిపడుతున్నారు. ఈసీ, రిజిస్ర్టార్‌ను సంప్రదించేందుకు రాత్రి వరకు ప్రయత్నించినా.. అందుబాటులోకి రాలేదంటూ వాపోయారు.


Updated Date - 2021-06-17T06:18:27+05:30 IST