నిషేధిత గుట్కా ప్యాకెట్ల పట్టివేత

May 8 2021 @ 23:29PM

మెదక్‌ అర్బన్‌, మే 8: జిల్లా కేంద్రంలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. శనివారం పట్టణంలోని హౌసింగ్‌బోర్డ్‌ ప్రాంతంలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కాలనీకి చెందిన కొమ్మ చంద్రయ్య ఇంట్లో దాచిఉన్న రూ.31,845 విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాఽధీనం చేసుకున్నారు. నిందితుడ్ని అదపులోకి తీసుకుని, పట్టణ పోలీసులకు అప్పగించారు. గుట్కా ప్యాకెట్లను పట్టుకున్న సిబ్బందిని ఎస్పీ అభినందించారు. జిల్లాలో ఎక్కడైనా ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్లను అమ్మినట్లు తెలిస్తే డయల్‌ 100, లేదా జిల్లా పోలీస్‌ వాట్సాప్‌ నంబర్‌ 7330671900కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు.


 

Follow Us on: