వేగవంతమైన సేవలు అందిస్తాం

ABN , First Publish Date - 2020-12-03T05:43:10+05:30 IST

విశ్వవిద్యాలయ కాలేజ్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌, డీన అకడమిక్‌ అఫైర్స్‌లు విశ్వవిద్యాలయానికి వెన్నుముక వంటి వని, వీటిని పటిష్టపరిచి వేగవంతమైన సేవలందిస్తా మని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వీసీ మొ క్కా జగన్నాథరావు పేర్కొన్నారు.

వేగవంతమైన సేవలు అందిస్తాం

దివానచెరువు, డిసెంబరు 2: విశ్వవిద్యాలయ కాలేజ్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌, డీన అకడమిక్‌ అఫైర్స్‌లు విశ్వవిద్యాలయానికి వెన్నుముక వంటి వని, వీటిని పటిష్టపరిచి వేగవంతమైన సేవలందిస్తా మని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వీసీ మొ క్కా జగన్నాథరావు పేర్కొన్నారు. సీడీసీ, డీన అకడమిక్‌ అఫైర్స్‌ కార్యాలయాలను ఆధునిక హంగులతో రూపొందించి ఎమెనిటీస్‌ సెంట రులోకి బుధవారం మార్చారు. ఈ సందర్భం గా వీసీ మాట్లాడుతూ ఉభయగోదావరి జిల్లా ల్లోని డిగ్రీ, పీజీ కళాశాలలకు సంబం ధించిన అన్ని వ్యవహారాలు విశ్వవిద్యాలయం సీడీసీ పరిధిలోకి వస్తాయ న్నారు. వాటిని సత్వరమే పరిష్కరించే వ్యవస్థను సిద్ధం చేయాలన్నారు. సీడీసీ అకడమిక్‌ అఫైర్స్‌ సమన్వయంగా పని చేసి నాణ్యమైన, సులభమైన, పటిష్టమైన పరి పాలన అందించేందుకు కృషి చేయాలని సూచిం చారు. కార్యక్రమంలో రిజిసా్ట్రర్‌ ఆచార్య బట్టు గంగా రావు, అకడమిక్‌ అఫైర్స్‌, సిడీసి డీనలు వై.శ్రీనివా సరావు, ఎం.కమలకుమారి, సహాయ డీనలు పడాల రాజశేఖర్‌, ఎం.గోపాలకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-03T05:43:10+05:30 IST