కుడుపూడిపై కేసులు ఎత్తేయకుంటే ఉద్యమమే

ABN , First Publish Date - 2022-05-16T06:26:38+05:30 IST

ఉభయ తెలుగు రాష్ర్టాల శెట్టిబలిజ మహానాడు కన్వీనర్‌ కుడుపూడి సూర్య నారాయణరావుపై పెట్టిన అక్రమ కేసులను తక్షణం ఎత్తి వేయాలని శెట్టిబలిజ మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జక్కంశెట్టి రాజేంద్రప్రసాద్‌ డిమాండ్‌ చేశారు.

కుడుపూడిపై కేసులు ఎత్తేయకుంటే ఉద్యమమే

శెట్టిబలిజ సంఘం నాయకులు
అమలాపురం టౌన్‌, మే 15: ఉభయ తెలుగు రాష్ర్టాల శెట్టిబలిజ మహానాడు కన్వీనర్‌ కుడుపూడి సూర్య నారాయణరావుపై పెట్టిన అక్రమ కేసులను తక్షణం ఎత్తి వేయాలని శెట్టిబలిజ మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జక్కంశెట్టి రాజేంద్రప్రసాద్‌ డిమాండ్‌ చేశారు.  అమలాపురం హైస్కూల్‌ సెంటర్‌లోని కుడు పూడి కార్యాలయం వద్దకు రాష్ట్రం నలు మూలల నుంచి శెట్టిబలిజ సంఘ ప్రముఖులు ఆదివారం తరలివచ్చి కుడుపూడికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ కేసులు ఉపసంహరించకుంటే గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. శెట్టిబలిజల సత్తా ఏమిటో ముఖ్యమంత్రి జగన్‌కు తెలుసన్నారు. శెట్టిబలిజల వల్లే ప్రభుత్వం నిలబడిందన్నారు. తేడా వస్తే గత ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో అదే గతి ఈ ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు. త్వరలో కుడుపూడి సూర్యనారాయణరావు నాయకత్వంలో పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల్లో ఏదో ఒక ప్రాంతంలో శెట్టిబలిజ మహానాడు భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని చెప్పారు. త్వరలో తేదీ ప్రకటిస్తామన్నారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చేసింది ముమ్మాటికి తప్పేనన్నారు. వ్యక్తిగతంగా కృతజ్ఞతలు చెప్పుకోవచ్చు కానీ శెట్టిబలిజల ఆత్మగౌరవాన్ని, మనోభావాలను దెబ్బతీసే విధంగా మంత్రి వేణు వ్యవ హరించారని చెప్పారు. ఇప్పటికే గ్రామగ్రామానా శెట్టిబలిజ యువత రగిలి పోతోందని చెప్పారు. తెల ంగాణ రాష్ట్రంలో ముఖ్య మంత్రి కేసీఆర్‌ శెట్టిబలిజ అనుబంధ కులాలకు 50 శాతం బ్రాందీ షాపులను కేటాయించారని, అదే విధ ంగా రాష్ట్రంలో జగన్‌ ప్రభు త్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. వెనుకబడిన కులాల్లోని చేతివృత్తుల వారికి ప్రభుత్వం అందిస్తున్న రూ.10 వేలు సాయాన్ని గీత కార్మికులందరికీ వర్తింప చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-05-16T06:26:38+05:30 IST