జీవాల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ

ABN , First Publish Date - 2020-12-04T04:48:56+05:30 IST

జీవాల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ

జీవాల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ

వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌

వికారాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం పశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ అన్నారు. గురువారం వికారాబాద్‌ పట్టణ పరిధిలోని మద్గుల్‌చిట్టపల్లి గ్రామంలో పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జీవాల నట్టల  నివారణ శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సన్నకారు రైతులు జీవాల పెంపకాన్ని చేపట్టి అతి తక్కువ పెట్టుబడితో లాభాలు పొందవచ్చన్నారు. కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ జిల్లా అధికారి వసంత కుమారి, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులరమేష్‌, స్థానిక కౌన్సిలర్లు సంతోష, గోపాల్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ ముత్యంరెడ్డి, వైస్‌చైర్మన్‌ పాండు, వికారాబాద్‌ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ ముత్తహార్‌ షరీఫ్‌, మునిసిపల్‌ మాజీ వైస్‌చైర్మన్‌ చిగుళ్లపల్లి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

2,254 జీవాలకు నట్టల నివారణ మందులు

యాలాల : యాలాల మండలంలో గురువారం 2,254 జీవాలకు నట్టల నివారణ మందులు వేసినట్లు మండల పశువైద్యాధికారి శ్రీకర్‌రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని బెన్నూరు, చెన్నారం, దౌలాపూర్‌, గిరిజాపూర్‌, గంగసాగర్‌ గ్రామాల్లో 1,404 మేకలకు, 850 గొర్రెలకు మందులను వేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బెన్నూరు సర్పంచ్‌ పటేల్‌రెడ్డి,  రైతులు అనంతయ్య, బుగ్గప్ప, శేఖర్‌, సిబ్బంది ముబీన్‌, బాల్‌రాజ్‌, లక్ష్మమ్మ, శ్రీనివాస్‌ నారాయణ, ఆనంద్‌ పాల్గొన్నారు. 

8వరకు నట్టల నివారణ మందు పంపిణీ

కులకచర్ల: ఈనెల 8వ తేదీ వరకు జీవాలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేయనున్నట్లు పశువైద్యాధికారి నాగప్రసాద్‌ తెలిపారు. గురువారం బొంరెడ్డిపల్లి గ్రామంలో సర్పంచ్‌ ఆంజనేయులుతో కలిసి మేకలకు నట్టల నివారణ మందులు తాగించారు.  

240 జీవాలకు మందుల పంపిణీ

కొడంగల్‌: కొడంగల్‌ మండల పరిధిలోని హుసేన్‌పూర్‌, ప్యాలమద్ది గ్రామాల్లో గురువారం 150 గొర్రెలు, 90 మేకలకు నట్టల నివారణ మందులు వేశారు. ఈ సందర్భంగా పశువైద్య అధికారి వెంకటయ్య మాట్లాడారు. కార్యక్రమంలో పశువైద్య  సిబ్బంది సమీర్‌, రాకేశ్‌గౌడ్‌ పాల్గొన్నారు.

పర్వత్‌పల్లిలో..

బషీరాబాద్‌ : సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా జీవాలకు నట్టల నివారణ మందులు వేయించాలని పర్వత్‌పల్లి ఉపసర్పంచ్‌ బ్రహ్మానందరెడ్డి సూచించారు. గురువారం గ్రామంలో   వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. సిబ్బంది రవి పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T04:48:56+05:30 IST