షెడ్డు గద్దెలపైనే దుకాణాలు పెట్టాలి

Jun 15 2021 @ 00:49AM
రైతులతో మాట్లాడుతున్న చైర్మన్‌, అధికారులు

తూప్రాన్‌, జూన్‌ 14: వేసెడ్‌ రైతు మార్కెట్‌లో రైతులు, చిరు వ్యాపారులు షెడ్డు గద్దెలపైనే దుకాణాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్‌ చైర్మన్‌, మార్కెట్‌శాఖ అధికారులు, తహసీల్దారు సూచించారు. ’ఆంధ్రజ్యోతి’లో ’వేసైడ్‌ రైతు మార్కెట్‌లో ఖాళీగా షెడ్లు’ అనే శీర్షికతో అదివారం ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం విదితమే. ఇందుకు స్పందించిన మంత్రి హరీశ్‌రావు వెంటనే గడ ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డికి ఫోన్‌ చేసి వేసైడ్‌ రైతు మార్కెట్‌లో దుకాణాలు ఏర్పాటు చేసేట్టు చూడాలని ఆదేశించారు.  ఈ మేరకు సోమవారం మున్సిపల్‌ చైర్మన్‌ బొంది రాఘవేందర్‌గౌడ్‌, మార్కెటింగ్‌శాఖ డీఈ మాధవరెడ్డి, కార్యదర్శి రాములునాయక్‌, తహసీల్దారు శ్రీదేవిలు వేసైడ్‌ రైతు మార్కెట్‌కు  వెళ్లి రైతులు, చిరు వ్యాపారులతో మాట్లాడి షెడ్‌ గద్దెలపైనే దుకాణాలు ఏర్పాటు చేయాలని సూచించారు. 15 రోజుల్లో చిరువ్యాపారులకు షెడ్ల ఏర్పాటు పూర్తవుతుందని మార్కెటింగ్‌శాఖ డీఈ వివరించారు.  

Follow Us on: